Share News

Great Giver : మహాదాత

ABN , Publish Date - Dec 20 , 2023 | 05:55 AM

అనగనగా ఒక ఊరిలో ఓ ధనికుడు ఉండేవాడు. అతని పేరు నాగయ్య. ధనికుడే కానీ రాక్షసుడు అనేవారంతా. ఎవరేమన్నా పెద్దగా పట్టించుకునేవాడు. ఎవరికీ రూపాయి

Great Giver : మహాదాత

అనగనగా ఒక ఊరిలో ఓ ధనికుడు ఉండేవాడు. అతని పేరు నాగయ్య. ధనికుడే కానీ రాక్షసుడు అనేవారంతా. ఎవరేమన్నా పెద్దగా పట్టించుకునేవాడు. ఎవరికీ రూపాయి అడిగినా ఇచ్చేవాడు కాదు. ‘కష్టపడి సంపాదించాలి’ అంటూ సలహా ఇచ్చేవాడు. అతడిని కొందరు ఇలా అనుకునేవారు.. ‘వీడు చచ్చినా మారడు. వీడికోసం ఏడ్వరు’. ఆ ధనికుడు తన బంధువులకూ, అన్నదమ్ములకూ ఏ రోజూ రూపాయి ఇవ్వలేదు. పైగా నా డబ్బు ఎవరికైనా ఖర్చు చేస్తాను అనేవాడు. ధర్మాత్ముడు అనే భావన అతనిది. ఆ ధనికుడిని తిట్టుకున్న వాళ్లే ఉన్నారు కానీ పొగిడిన పాపాన పోలేదు.

ఒక రోజు ఓ వ్యక్తి ఆ ధనికుడు దగ్గరకు వచ్చాడు. ‘అయ్యా.. ధర్మం చేయండి’ అన్నాడు. ‘ఏమిటీ.. ధర్మమా? అసలు నువ్వు ఈ ఊరి వాడవేనా?’ అన్నాడు. అదేంటీ.. ‘నేను దానధర్మాలు చేయనని అందరికీ తెలుసు. నీకు తెలియదా?’ అంటూ కోప్పడ్డాడు. ఆ వ్యక్తి తిట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఎవరో బయట వీధిలో ‘చెప్పులు కుట్టేవాడి దగ్గరకు వెళ్లు. సాయం దొరుకుతుంది’ అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి చెప్పులు కుట్టే ఆయన దగ్గరకు వెళ్లాడు. అతను సాయం చేశాడు. ఈ ఊరిలో చెప్పులు కుట్టేవాడే మహాదాత అనుకున్నాడా వ్యక్తి.

కొన్నేళ్ల తర్వాత ధనికుడు రోగంతో చనిపోయాడు. చాలామంది చూడటానికి కూడా వెళ్లలేదు. ఊరి జనాలు అతన్ని పాతిపెట్టడానికి ఇష్టపడలేదు. చివరికి అతని పాతిపెట్టారు. ఆ తర్వాత కూడా బిచ్చగాళ్లు వస్తూనే ఉన్నారు. అందరూ ధాన్యాల బదులు డబ్బులు అడుగుతున్నారు. చెప్పులు కుట్టేవాడి ఇంటి ముందు జనాలు బారులు తీరారు. అయితే చెప్పులు కుట్టేవాడు.. ‘ఇక డబ్బు అడగకండి. నా దగ్గర లేదు. ఇచ్చినన్నాళ్లూ ఇచ్చాను. నేను బతుక్కోవాలి కదా?’ అన్నాడు. దీంతో కొందరు ఆ చెప్పులు కుట్టేవాడిని తిట్టారు. వీడికి మనసే లేదు అన్నారు. ‘మీకు సమయం వృధా. నేను ఇవ్వలేను డబ్బులు’ అంటూ చెప్పులు కుట్టేవాడు గెంటేశాడు బిచ్చగాళ్లను.

చెప్పులు కుట్టేవాడి పొగరు చూసి ఆ ఊరి పెద్ద మనిషి దండించాడు. ఇన్నాళ్లూ బాగున్నావే.. ఇప్పుడేమైంది అన్నాడు. శాంతంగా అడగటంతో చెప్పులు కుట్టేవాడు ఏడ్చాడు. ‘మీరంతా ధనికుడిని తిట్టుకుంటారు. ప్రతిరోజూ ఆయన దానధర్మాలకోసమని నాకు డబ్బులు ఇచ్చేవాడు. తాను చేస్తున్నట్లు చెప్పవద్దని ఒట్టు వేయించుకున్నాడు. ఆయన వెళ్లిపోయిన తర్వాత నాకు డబ్బులు ఇచ్చేవారు లేరే? ఆయన ధర్మాత్ముడు.. మహాదాత’ అంటూ ఏడ్చేశాడు. చెప్పులు కుట్టేవాడి మాటలు విన్నాక.. అక్కడి జనాలే కాదు.. ఊరంతా ధనికుడిని బాధపడ్డారు. మహాదాత ధనికుడు అంటూ కొనియాడారు.

Updated Date - Dec 20 , 2023 | 05:55 AM