Himalayan Monal : మీకు తెలుసా?
ABN , First Publish Date - 2023-11-09T04:34:48+05:30 IST
తలమీద కిరీటంలా ఈకలు.. చూడటానికి అచ్చు నెమలిలా అందంగా ఉండే ఈ పక్షిని ‘హిమాలయన్ మోనల్’ అని పిలుస్తారు. 2500 మీటర్లు నుంచి 4500 మీటర్లు ఎత్తులో
తలమీద కిరీటంలా ఈకలు.. చూడటానికి అచ్చు నెమలిలా అందంగా ఉండే ఈ పక్షిని ‘హిమాలయన్ మోనల్’ అని పిలుస్తారు. 2500 మీటర్లు నుంచి 4500 మీటర్లు ఎత్తులో నివసిస్తాయి. మగపక్షులు అందంగా ఉంటాయి. అయితే ఆడపక్షులు మాత్రం గోధుమరంగులో ఉంటాయి.
బరువు కేజీన్నర నుంచి రెండు కేజీల మఽధ్యలో ఉంటాయి. 70 సెం.మీ పొడవు ఉంటాయి.
ఆసియా ఖండంలో మనదేశం(ఉత్తరాఖండ్, కశ్మీర్, హిమాలయ ప్రాంతాల్లో)తో పాటు పాకిస్తాన్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, మయన్మార్ దేశాల్లో ఈ పక్షులు కనిపిస్తాయి.
వీటి గుంపులో తక్కువ పక్షులుంటాయి. ఇదో సోషల్ బర్డ్. చిన్న మొక్కల మొదళ్ల దగ్గర గుంతలు తవ్వుతాయి. 25 సెం.మీ వరకూ తవ్వి అక్కడ నిద్రపోతాయి.
పురుగులు, విత్తనాలు, పండ్లు లాంటివి తిని బతుకుతాయి.
ప్రతి ఆడపక్షి మూడు నుంచి ఐదు గుడ్లు మాత్రమే పెడుతుంది. ఇరవై ఏడు రోజులు పొదుగుతాయి. పిల్లలు పట్టిన తర్వాత ఆర్నెళ్ల తర్వాత అవి స్వతంత్రంగా బతుక్కోగలవు.
గాలిలో దూసుకుపోయేటప్పుడు, మంచులో పరిగెత్తేప్పుడు చాలా అందంగా కనపడతాయివి.
1970ల్లో హిమాలయన్ ప్రాంతాల్లో ఈ పక్షులను వేటాడటం ఓ ఆటగా భావించేవారు. ముఖ్యంగా మాంసం కోసం వేటాడేవాళ్లు. ఇప్పుడు వీటి వేటను నిషేధించారు. మనదేశంలోని స్టాంప్స్మీదనే కాకుండా నేపాల్ దేశంలోని నోట్ల కాగితాల మీద వీటి ఫొటోలు ఉంటాయి.