ఆశపోతు శునకం

ABN , First Publish Date - 2023-06-08T00:36:58+05:30 IST

ఒక ఊరిలో ఓ శునకం ఉండేది. దానికి ఆశ ఎక్కువ. ఆకలి ఎక్కువ. అది ఊరి కాలువ గట్టున ఉండే చిన్న వనంలో ఉండేది. అది అక్కడి హాయిగా ఉండేది. చీకూ చింతా లేకుండా గడిచేది. మంచి ఆహారం,

ఆశపోతు శునకం

ఒక ఊరిలో ఓ శునకం ఉండేది. దానికి ఆశ ఎక్కువ. ఆకలి ఎక్కువ. అది ఊరి కాలువ గట్టున ఉండే చిన్న వనంలో ఉండేది. అది అక్కడి హాయిగా ఉండేది. చీకూ చింతా లేకుండా గడిచేది. మంచి ఆహారం, సంతోషం ఉండేది. ఒక రోజు దానికి ఏమీ ఆహారం దొరకలేదు. దీంతో మరుసటి రోజు ఉదయమే ఇక కుదరదని దూరంగా వెళ్లాలనుకుంది. కాలువ మీద ఉండే వంతెనను దాటింది. ఆ వంతెన దాటగానే ఓ పెద్ద ఎముక కనపడింది. కనపడగానే దాని ప్రాణం లేచొచ్చింది. ఇక తన జీవితం సంతోషం అనుకుంది. వెంటనే నోటిన కరచుకుంది ఆ ఎముకను.

నోట్లో ఎముకను పెట్టుకుని వేగంగా వస్తోంది. వంతెనను దాటేప్పుడు పైనుంచి చూసింది. వంతెన మీద.. అది కూడా నోటిలో ఎముక.. దీంతో శునకం ఆనందానికి అవధుల్లేవు. తనకంటే గొప్ప ఎవరూ లేరనుకునే ఆలోచనలో ఉంది. కిందకు అలా చూడగానే.. నీటిలో మరో శునకం ఉంది. అది ఎముకను పట్టుకుని ఉంది. దీంతో ఈ శునకానికి కోపం వచ్చింది. ఒక్కసారి ఆ నీటిలోని శునకం వైపు చూసి మొరిగింది. నీటిలోని ఆ శునకమూ మొరిగింది. మళ్లీ ఎముకను నోట కరచుకుంది. నీటిలోని శునకమూ అలానే చేసింది. దీంతో మరింత కోపంతో గట్టిగా మొరిగింది. క్షణాల్లో నోటిలోని ఎముక నీళ్లలో పడిపోయింది.

నీళ్లలో ఎముక పడిన తర్వాత కానీ శునకానికి విషయం అర్థం కాలేదు. ఏమి చేయాలో పాలుపోక అలానే వంతెన మీద కూర్చుంది. దొరక్క దొరక్క ఎముక దొరికితే పోగొట్టుకుంది. అసలు నీటిలో శునకమే లేదనే విషయం గ్రహించింది. చేసేదేమీ లేక బాధతో ఇంటకి వెళ్లిపోయింది.

Updated Date - 2023-06-08T00:36:58+05:30 IST