Hungary: దేశం - హంగేరీ

ABN , First Publish Date - 2023-06-14T03:42:01+05:30 IST

యూర్‌పలోనే ఇది అతి ప్రాచీనమైన దేశం ఇది. 895 లో ఈ దేశం ఏర్పడింది. తొలుత ఇది రోమన్‌ రాజుల ఆధీనంలో ఉండేది.

Hungary: దేశం - హంగేరీ

యూర్‌పలోనే ఇది అతి ప్రాచీనమైన దేశం ఇది. 895 లో ఈ దేశం ఏర్పడింది. తొలుత ఇది రోమన్‌ రాజుల ఆధీనంలో ఉండేది. ఇక్కడ హంగేరియన్‌ భాష మాట్లాడతారు. ఈ దేశంలో పిల్లల పేర్లు పెట్టాలంటే.. ఒక అప్లికేషన్‌ నింపాలి. ప్రభుత్వం అప్రూవ్‌ చేస్తేనే ఆ పేరు పిల్లలకు పెట్టాలి.

ఇది కమ్యూనిజం దేశంగా ఉండేది. 1956లో విప్లవం వచ్చింది. 1989 వరకూ ఈ దేశం కమ్యూనిస్ట్‌ దేశమే.

ఈ దేశం రాజధాని పేరు బుడాపెస్ట్‌. బుడా, పెస్ట్‌, ఒబుడా అనే మూడు పట్టణాల కలయిక ఈ నగరం. ఇదెంతో అందమైన నగరం. ఇకపోతే హంగేరీ జనాభా కేవలం 98 లక్షల మందే.

సముద్రమట్టానికి 1014 మీటర్ల ఎత్తులో ఉంటుందీ దేశం.

1848 నుంచి ఒకే జెండా ఉండే హంగేరీ జెండా 1957లో మారింది. 12 అక్టోబర్‌ 1957లో వచ్చిన ఈ జెండాలో రంగులను వివరిస్తే.. తెలుపు నదుల్ని, ఆకుపచ్చ పర్వతాల్ని, ఎరుపు త్యాగధనులకు గుర్తుగా జెండాను రూపొందించారు.

1500 సంవత్సరంలో ఎక్కువ మంది జనాలు ప్రయాణించే వాహనాన్ని కనుగొన్నారు. దాన్ని కోచ్‌ అని పిలిచేవాళ్లు.

Untitled-7.jpg

వీరి జాతీయ క్రీడ ఫుట్‌బాల్‌. ఆసక్తికరమైన విషయమేంటంటే తొలినాళ్లలో కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ భాష, టెలిఫోన్‌ ఎక్చేంజి, ఎలక్ర్టిక్‌ మోటార్‌ను వీళ్లే కనుగొన్నారు.

ఎక్కువ వస్తువులను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటుంది.

విటమిన్‌-సి కనుగొన్న ఆల్బర్ట్‌, గ్యోర్గీలు ఈ దేశస్థులే. థర్మల్‌ బాత్‌ ఇక్కడ పాపులర్‌. ఒక్క రాజధాని బుడాపె్‌స్టలో దాదాపు 1600 దాకా స్పాలు ఉన్నాయి. గ్రీక్‌, టర్కిష్‌ ఆర్కిటెక్చర్‌తో ఉంటాయివి.

శాంతి విభాగంలో తప్ప దాదాపు అన్నిరంగాల్లో నోబెల్‌ బహుమతులు అందుకున్నారు. ఈ దేశానికి 13 నోబెల్‌ బహుమతులు ఉన్నాయి.

ఇక్కడ వాటర్‌ పోలో గేమ్‌ పాపులర్‌. ఒలంపిక్స్‌లో ఏకంగా 15 పతకాలను గెలుచుకుందంటే అర్థం చేసుకోవచ్చు.

1367 సంవత్సరంలోనే ఇక్కడ విశ్వవిద్యాలయం నెలకొల్పారు. 1896లోనే ఇక్కడ మెట్రో స్టేషన్‌ను కట్టారు.

Updated Date - 2023-06-14T03:42:01+05:30 IST