Story : కోడి అన్నయ్య
ABN , First Publish Date - 2023-03-13T23:33:17+05:30 IST
ఒక అడవికి దగ్గరగా పేద్ద నీటి కుంట ఉండేది. అందులో ఒక మొసలి నివసించేది. నీళ్లు తాగటానికి వచ్చిన జంతువులను తిని బతికేది. చాలా తెలివైన మొసలి అది. ఒక రోజు అడవికి దగ్గరలో ఉండే ఊరిలోంచి
ఒక అడవికి దగ్గరగా పేద్ద నీటి కుంట ఉండేది. అందులో ఒక మొసలి నివసించేది. నీళ్లు తాగటానికి వచ్చిన జంతువులను తిని బతికేది. చాలా c అది. ఒక రోజు అడవికి దగ్గరలో ఉండే ఊరిలోంచి ఒక కోడి అటు వైపు వచ్చింది. బాగా తిరిగాక ఎండకు అలసిపోయింది. నీళ్లు దప్పిక కావటంతో ఆ కుంట దగ్గరకు పోయింది. అది గమనించిన మొసలి వేగంగా కోడి దగ్గరకు వచ్చేసింది. ఎంతో ఆకలిగా ఉంది. దగ్గరకు వస్తూనే ‘నువ్వు.. నా అన్నయ్యవి. నువ్వు నన్ను తింటావా? ఎలా తింటావు?’ అన్నది కోడి. దీంతో ఆలోచనలో పడిన మొసలి ఒంటరిగా వెనక్కి వెళ్లిపోయింది.
మరుసటి రోజు కూడా అడవిలోనే కోడి ఉంది. ఎందుకంటే అడవంటే కోడికి నచ్చింది. యథావిధిగా నీళ్లు తాగటానికి మళ్లీ కుంట దగ్గరకు పోయింది. మళ్లీ కోడిని తినటానికి మొసలి వెళ్లింది. ‘మీ చెల్లిని ఎలా తింటావు?’ అంటై అడిగింది కోడి. సమాధానం చెప్పలేక మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది మొసలి.
అసలు భూమి మీద ఉండే కోడికి, నీటిలో ఉండే నాకూ చుట్టరికమేంటీ? అని పలుమార్లు ఆలోచించింది మొసలి. దానికి అర్థం కాలేదు. చేసేదిమిలేక తన మిత్రుడు బల్లి దగ్గరకు వెళ్లింది. మొసలి రాకను చూసి బల్లి సంతోషపడింది. విషయమేంటని వాకబు చేసింది. ‘అసలు కోడికి, నాకు చుట్టరికమేంటీ? అర్థమే కాలేదు. తను నన్ను ఫూల్ చేస్తోందా?’ అని తన ప్రశ్నలను బల్లితో అడిగింది. బల్లి క్షణం కూడా ఆలోచించకుండా.. ‘డియర్ స్టుపిడ్ ఫ్రెండ్. దీనికి ఇంత దూరం వచ్చావా? కోళ్లు గుడ్లు పెడతాయి. అలాగే మాతో పాటు మీరు, తాబేళ్లు గుడ్లు పెడతాయి కదా. అలా మనమంతా సిబ్లింగ్స్ అవుతాము’ అన్నది. అంతే క్షణాల్లో మొసలి ఆలోచనలు మారిపోయాయి. ‘ధన్యవాదాలు మిత్రమా.. ఇంత సులువుగా చెప్పినందుకు’ అంటూ మొసలి ఇంటికి వెళ్లిపోయింది. ఆ రోజునుంచి కోళ్లను మొసలి తినలేదు.