అసూయ కాకి

ABN , First Publish Date - 2023-07-15T23:07:38+05:30 IST

ఒక ఊరిలో అందరినీ చూసి అసూయపడే కాకి ఉండేది. ఏ పక్షి దగ్గర ఆహారం చూసినా.. ఏ జంతువు ప్రశాంతంగా నిద్రపోతున్నా దానికి నచ్చేది కాదు.

అసూయ కాకి

ఒక ఊరిలో అందరినీ చూసి అసూయపడే కాకి ఉండేది. ఏ పక్షి దగ్గర ఆహారం చూసినా.. ఏ జంతువు ప్రశాంతంగా నిద్రపోతున్నా దానికి నచ్చేది కాదు. కావు.. కావు అంటూ వాటి ఏకాగ్రతను చెడగొట్టేది. ఆహారం అంతా తన దగ్గరే ఉండాలని కోరుకుండేది. తన గొంతు శ్రావ్యంగా ఉందని భ్రమపడేది. అందుకే అదే పనిగా కోయిలకు పోటీగా కావుకావు మంటూ అరిసేది. అయితే కాకిని ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. ఒక రోజు కాకి.. నన్నెవరూ పట్టించుకోలేదని ఓ గుంట నక్కను అడిగింది. ‘నీకు అందరికంటే అందంగా ఉండే హంసలు తెలుసా?’ అన్నది. ‘తెలీదు..’ అన్నది. ‘తూర్పు దిక్కున హంసల చెరువు ఉంది. అక్కడకు వెళ్లు’ అన్నది నక్క.

Swan.jpg

ఏమాత్రం ఆలోచించకుండా హంసల చెరువు వెళ్లింది. హంసలు ఎంతో అందంగా ఉన్నాయి. అలా తాను కూడా కావాలనుకున్నది. ఓ హంస దగ్గరకు వెళ్లి అడిగింది. ఏ ఆహారం తింటారు? అని . గడ్డి, పురుగులు తింటామన్నది. అయితే తాను తింటానంది. ఆ రోజునుంచి హంసల ఆహారం తింటూ కూర్చుంది. రెండు రోజులయ్యాక.. నీళ్లలో ఈదటం వల్ల హంసలు తెల్లగా అయ్యాయేమో.. నాకు చెప్పలేదే.. అనుకుని అసూయపడింది. తాను హంసలకంటే అందంగా అవ్వాలని హంసలతో పాటు నీటిలో ఈదటం ప్రారంభించింది. అసలు ఆహారం సరిగా తినక.. నీళ్లలో ఈదుతూ రెండు మూడురోజుల్లోనే చిక్కి శక్యలమైంది. దీంతో హంసలా కావాలనే కాకి కోరిక కాస్త చావు దగ్గరకు వచ్చింది. అపుడు ఆ నీటిలోని హంస ఇలా అన్నది.. ‘నీ గొప్ప నీది. ప్రకృతిలో ఒక్కొరిదీ ఒక్కో తీరు. ఎవరితో పోల్చుకోకు. మేము నీలాగా గాల్లో ఎగరలేను కదా. మనుషుల దగ్గరకు కూడా వెళ్లలేను కదా’ అన్నది. కాకికి అసూయ పోయింది. ఆలోచన మెరుగైంది. పోలిక వద్దనుకుంది.

Updated Date - 2023-07-15T23:07:38+05:30 IST