Loon: మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-08-05T03:26:36+05:30 IST

నల్లటి మెడ, పొడవాటి ముక్కు ఉండి.. నీటిలో ఉండే ఈ పక్షి పేరు లూన్‌. దీన్నే గ్రేట్‌ నార్తర్న్‌ లూన్‌ అని పిలుస్తారు.

Loon: మీకు తెలుసా?

నల్లటి మెడ, పొడవాటి ముక్కు ఉండి.. నీటిలో ఉండే ఈ పక్షి పేరు లూన్‌. దీన్నే గ్రేట్‌ నార్తర్న్‌ లూన్‌ అని పిలుస్తారు.

1788లో వీటికి ఈ పేరు పెట్టాడో పక్షిప్రేమికుడు.

అమెరికాలో లూన్‌ అని పిలిస్తే దీన్ని యూరోపియన్‌ దేశాల్లో డైవర్‌ అని పిలుస్తారు. ఎందుకంటే డైవ్‌ చేస్తూ చేపలను సులువుగా పట్టగలదు. 90 మీ. లోపల వరకూ వేగంగా వెళ్లి చేపలను పడుతుంది.

ఇవి 66 నుంచి 94 సెం.మీ పొడవు ఉంటాయి. వింగ్‌ స్పాన్‌ 147 సెం.మీ. బరువు సుమారు రెండున్నర కేజీల నుంచి 7.5 కేజీల మధ్యలో ఉంటాయి.

ఇవి నీళ్ల ఉపరితలం మీద పరిగెత్తినట్లు నడుస్తాయి. రెక్కలు మాత్రమే పైకి కనపడుతుంటాయి. సముద్రం లేదా నీటి తలానికి దగ్గరలో ఉండే పచ్చికమైదానాల్లో ఇవి గూళ్లు కట్టుకుంటాయి.

ఆలివ్‌ బ్రౌన్‌ రంగులో ఉండే గుడ్లు పెడతాయి. ఇవి రెండు గుడ్లు మాత్రమే పెడతాయి. వీటి మీద ఆడ, మగ పక్షులు రెండూ పొదుగుతాయి. 28 రోజులు పొదిగే సమయం. రెండు పక్షులు ఏమాత్రం పొరబడినా.. నక్కలు, గద్దలు, కాకులు ఆ గుడ్లను తినేస్తాయి.

ఇవి వెజిటేరియన్‌ ఫుడ్‌ తింటాయి. అయితే తొంభై శాతం చేపలను మాత్రమే తింటాయి.

అలస్కా, గ్రీన్‌లాండ్‌, స్కాట్లాండ్‌.. ఇలా కేవలం చల్లని ప్రాంతాల్లో ఉండటానికే ఇష్టపడతాయివి.

చలికాలంలో, వేసవిలో వీటి కళ్లు రంగు బూడిద రంగులోకి మారినట్లుంటాయి. వాతావరణ కాలుష్యం బారిన పడి ఎక్కువగా చనిపోతుంటాయి.

వీటి జీవనకాలం 30 ఏళ్లు.

Updated Date - 2023-08-05T03:26:36+05:30 IST