Share News

do you know : మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-11-29T23:42:18+05:30 IST

1912 నుంచి 1948 వరకూ ఒలింపిక్స్‌లో సంగీతం, చిత్రలేఖనం, శిల్పకళ, భవననిర్మాన కౌశల్యాలకు మెడల్స్‌ను బహుకరించేవారు.

do you know : మీకు తెలుసా?

  • 1912 నుంచి 1948 వరకూ ఒలింపిక్స్‌లో సంగీతం, చిత్రలేఖనం, శిల్పకళ, భవననిర్మాన కౌశల్యాలకు మెడల్స్‌ను బహుకరించేవారు. ఆ తర్వాతి కాలంలో ఈ మెడల్స్‌ ఇవ్వటం మానేశారు.

  • వంటవాళ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే చెఫ్స్‌ హ్యాట్‌లో 100 మడతలు ఉంటాయి. కోడిగుడ్లను 100 రకాలుగా వండవచ్చనే విషయాన్ని ఇవి సూచిస్తాయి.

  • ప్రపంచంలో నాలుగు దేశాల జాతీయ గీతాలకు ఎటువంటి పదాలు లేవు. వీటికి కేవలం ట్యూన్స్‌ మాత్రమే ఉంటాయి. ఈ దేశాలు- స్పెయిన్‌, బోస్నియా, హెర్జ్‌గోవినా, కొసావో, శాన్‌ మెరినో.

  • ఆకలి లేకపోయినా తినటాన్ని జపనీ్‌సలో - కుచి జమిషి అంటారు. నోరు ఒంటరిగా ఉంటుంది కాబట్టి.. దానికి పని కల్పించాలనే ఉద్దేశంతో కొందరు ఈ పని చేస్తూ ఉంటారు.

  • అమెరికా రాష్ట్రాల పేర్లలో ఎక్కడ ‘క్యూ’ అనే అక్షరం కనిపించదు.

Updated Date - 2023-11-29T23:42:19+05:30 IST