Olive Orapendola : మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-07-24T23:22:24+05:30 IST

కింద, తోక భాగంలో నల్లగా ఉండి.. మెడ దగ్గర ఆకుపచ్చ రంగు ఉండి.. ముక్కు నారింజ, తెలుపు రంగులో ఉండే పక్షిని ఆలివ్‌ ఓరపెండోలా అని పిలుస్తారు. 45 సెం.మీ పొడవు ఉంటుంది. అరకేజీ కంటే బరువు తక్కువ ఉంటుంది.

 Olive Orapendola : మీకు తెలుసా?

  • కింద, తోక భాగంలో నల్లగా ఉండి.. మెడ దగ్గర ఆకుపచ్చ రంగు ఉండి.. ముక్కు నారింజ, తెలుపు రంగులో ఉండే పక్షిని ఆలివ్‌ ఓరపెండోలా అని పిలుస్తారు. 45 సెం.మీ పొడవు ఉంటుంది. అరకేజీ కంటే బరువు తక్కువ ఉంటుంది.

  • వెనిజులా, కొలంబియా, ఈక్విడార్‌, బొలివియా దేశాల్లో కనిపిస్తాయివి.

  • మగ పక్షులు ఆడపక్షులకంటే పెద్దవిగా ఉంటాయి.

  • బెర్రీస్‌, పండ్లు, కూరగాయలు, చిన్న పురుగుల్ని తిని బతుకుతాయి.

  • ఇవి ఆరు రకాలుంటాయి. నలుపు, ఆకుపచ్చ..ఇలా రంగును బట్టి పిలుస్తారు.

  • ఇవి ఎత్తయిన చెట్లపై కాలనీల్లా గూళ్లను ఏర్పరుచుకుంటాయి. ఎప్పుడూ అరుస్తూ చలాకీగా ఉంటాయి. ప్రతి కాలనీలో కనీసం 30 పక్షులు ఉంటాయి.

  • చిత్తడి నేలల్లో ఉండటానికి ఇష్టపడతాయి. ఒక్కోపక్షి రెండు గుడ్లు మాత్రమే పెడుతుంది.

  • కేవలం మనుషుల ద్వారానే వీటికి ప్రమాదం ఉంది. ఈ పదేళ్లలో 30 శాతం పక్షులు అంతరించిపోయాయి.

  • ఇవి అందంగానే కాకుండా వాటి గొంతు బావుంటుంది. ఏవైనా పక్షులు శబ్దాలు చేస్తే అచ్చు అలానే మిమిక్రీ చేస్తాయి. డబ్బింగ్‌ బర్డ్స్‌ అని కూడా వీటిని అంటారు.

Updated Date - 2023-07-24T23:22:24+05:30 IST