'Purple Martin': మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-07-18T22:57:53+05:30 IST

రంగును బట్టి ఈ పక్షులను ‘పర్పుల్‌ మార్టిన్‌’ అని పేరు పెట్టారు. ఇవి దక్షిణ అమెరికాలో అధికంగా ఉంటాయి. ఇంటి వెనకాల ఉంటాయి. మనుషులతో కలిసిపోతాయి. చిన్నచిన్న పురుగుల్ని తిని బతుకుతాయి.

 'Purple Martin': మీకు తెలుసా?

రంగును బట్టి ఈ పక్షులను ‘పర్పుల్‌ మార్టిన్‌’ అని పేరు పెట్టారు. ఇవి దక్షిణ అమెరికాలో అధికంగా ఉంటాయి. ఇంటి వెనకాల ఉంటాయి. మనుషులతో కలిసిపోతాయి. చిన్నచిన్న పురుగుల్ని తిని బతుకుతాయి.

19 వ శతాబ్దంలో ఈ పక్షులు ఎక్కువగా వడ్రంగి పిట్టలు పెట్టిన గూళ్లలో నివసించేవి. అయితే ప్రస్తుతం దక్షిణ అమెరికాలోనే జనాలే వీటికోసం ప్రత్యేకంగా ఇంట్లోనే గూళ్లను నిర్మిస్తున్నారు. అంటే.. జనాలకెంత ఇష్టమో అర్థమవుతుంది.

కాలిఫోర్నియో, ఆరిజోనా, న్యూ మెక్సికోలో ఈ పక్షులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మంది ఈ పక్షుల గురించి డిష్కస్‌ చేస్తారు.

ఇరవై సెం.మీ పొడవు ఉంటుంది.. 40సెం.మీ. వింగ్‌ స్పాన్‌ ఉంటుంది.

ఇవి నాలుగు నుంచి ఆరు గుడ్లు పెడతాయి. ఇరవై ఆరు రోజులనుంచి ముప్ఫయి రెండు రోజుల వరకూ పొదుగుతాయి.

రాయల్‌ బ్లూ, నెవీ బ్లూ, డీప్‌ పర్పుల్‌ రంగుల్లో కనిపిస్తాయి. ఇవి ప్రపంచంలోనే అతి పెద్ద పిచ్చుకలు.

వందల పక్షులు గుంపులుగా ఉంటాయి. ఇవి 160 నుంచి 500 అడుగుల్లో ఎగురుతాయి. ఎక్కువగా దోమలను తింటాయి. ఇవి ఉండే ప్రాంతాల్లో దోమలు కనపడవు. ఒక గుంపు ఉంటే రోజుకు రెండువేల దోమలను తినేస్తాయి.

ఇవి మనుషులమీదనే ఆధార పడతాయి. దాదాపు పదమూడేళ్ల పాటు వీటి జీవితకాలం ఉంటుంది.

Updated Date - 2023-07-18T22:57:53+05:30 IST