Rangaiah, Mallaiah: చిన్నచూపు
ABN , First Publish Date - 2023-03-31T22:29:34+05:30 IST
ఒక ఊరిలో రంగయ్య, మల్లయ్య ఉండేవాళ్లు. ఇద్దరూ వ్యాపారులు. కొత్త ప్రదేశాలను చూడాలంటే ఇష్టపడేవాళ్లు. ఇద్దరూ కలిసి పలు రకాల ప్రాంతాలకు ప్రయాణించేవాళ్లు. వేసవి కాలం. ఎండ అధికంగా ఉంది.
ఒక ఊరిలో రంగయ్య, మల్లయ్య ఉండేవాళ్లు. ఇద్దరూ వ్యాపారులు. కొత్త ప్రదేశాలను చూడాలంటే ఇష్టపడేవాళ్లు. ఇద్దరూ కలిసి పలు రకాల ప్రాంతాలకు ప్రయాణించేవాళ్లు. వేసవి కాలం. ఎండ అధికంగా ఉంది. ఒక రోజు ఎండకు ఇద్దరు నడుస్తూ వెళ్తున్నారు. వేడి తట్టుకోలేక ప్రశాంతంగా సేద తీరటానికి ఓ చెట్టు కిందకు వెళ్లరు. సంతోషంగా అక్కడ కూర్చుని హాయిగా కొద్దిసేను కబుర్లు చెప్పుకున్నారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న తీపి మామిడి పండ్లను తిన్నారు.
‘ఈ చెట్లు ఏంటీ.. ఇది పండ్లు ఇస్తుందా?’ అంటూ రంగయ్య అడిగాడు. మల్లయ్య ‘లేదు. ఇది కేవలం చెట్టు అంతే. దీనికి పూలు పూస్తాయి. పండ్లు కాయవు’ అంటూ ఎగతాళి చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇదొక అనవసరమైన, ఉపయోగం లేని చెట్టు అన్నాడు. ‘అంతేనా.. ఈ పనికి మాలిన చెట్టు’ అంటూ రంగయ్య నవ్వాడు. ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు.. ఆ పండ్లు కాయని చెట్టును చూసి.
వీళ్లద్దరినీ చూసిన ఆ చెట్టు కోప్పడింది. గట్టిగా అరిచింది. ‘పనికిమాలిన యాత్రికులారా? ఆపండి మీ నవ్వు. అసలు మీరు ఎలా నన్ను పనికిమాలిన చెట్టు అని తీర్మానిస్తారు’ అన్నది. ఇద్దరూ భయపడిపోయారు. ‘అసలు నేను పనికిరాకుంటే నా కింద ఎలా ఇంత సమయం సేదతీరారు. మీకేమైనా సిగ్గుందా?’ అంటూ అడిగింది. రంగయ్య, మల్లయ్యలు ఇద్దరూ బిత్తరపోయి అక్కడనుంచి పరిగెత్తిపోయారు. ‘ఈ జనాలు ఇంతే.. ఎంత మంచి చేసినా ఇలా మాట్లాడతారు’ అనుకుంటూ ఆ చెట్టు బాధపడింది.