Share News

Story : డబ్బు కోసం...

ABN , First Publish Date - 2023-12-06T02:34:18+05:30 IST

అక్బర్‌, బీర్బల్‌ ఇద్దరూ ఖాళీగా ఉన్నప్పుడు, ప్రయాణాల్లో ఎప్పుడూ చర్చించుకుంటుంటారు. దానివల్ల ఎన్నో విషయాలు తెలిసేవి. పైగా బీర్బల్‌ దృష్టికోణం అంటే

Story : డబ్బు కోసం...

అక్బర్‌, బీర్బల్‌ ఇద్దరూ ఖాళీగా ఉన్నప్పుడు, ప్రయాణాల్లో ఎప్పుడూ చర్చించుకుంటుంటారు. దానివల్ల ఎన్నో విషయాలు తెలిసేవి. పైగా బీర్బల్‌ దృష్టికోణం అంటే అక్బర్‌కు ఇష్టం కూడా. సమస్యను బీర్బల్‌ పరిష్కరించే విధానం అక్బర్‌కు బాగా నచ్చుతుంది. ఒక రోజు అక్బర్‌, బీర్బల్‌ ఇద్దరూ సరస్సు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. డబ్బుకోసం ఏదైనా చేస్తారు జనాలు అన్నారు బీర్బల్‌. అక్కతో ఊరుకోకుండా.. ‘డబ్బుకోసం ఒక మనిషి ఏదైనా చేయగలడు. ఈ సరస్సులో రాత్రంతా ఉండమన్నా ఉంటారు’ అన్నాడు బీర్బల్‌. ‘అవునా.. ఇది నిజమా? అలా అయితే ఆ వ్యక్తికి బంగారు నాణేలు బహుమతిగా ఇస్తా’ అన్నాడు. వెంటనే ఆ వ్యక్తిని తీసుకురా అన్నారు అక్బర్‌. ‘సరే’నంటూ వెళ్లిపోయాడు బీర్బల్‌.

మరుసటి రోజు బీర్బల్‌ ఓ పేదవాడిని పట్టుకొని వచ్చాడు. అక్బర్‌ అడిగాడు.. ‘ఏమయ్యా.. నువ్వు.. ఈ రాత్రంతా నేను చూపించిన సరస్సులో ఉంటావా?’ అన్నాడు. అసలే చలికాలం.. అలా రాత్రంతా ఉండటం అసాధ్యం అన్నాడు అక్బర్‌. ‘మీకెందుకు మహాప్రభో.. ఉంటారీయన’ అంటూ బీర్బల్‌ అన్నాడు. ఆ రోజు రాత్రి బీర్బల్‌ చెప్పినట్లే ఆ పేదవాడు సరస్సులోంచి బయటికి రాకుండా అక్కడే ఉన్నాడు. పైగా అక్బర్‌ వేగులు, సైనికులు అతన్ని కనిపెడుతూనే ఉన్నారు. ఆ రోజు రాత్రి ఆ పేదవాడు బయటికి రాలేదు. అలానే ఉండిపోయాడు సరస్సులో.

మరుసటి రోజు అక్బర్‌, బీర్బల్‌లు ఆ సరస్సు దగ్గరకి వచ్చారు. ‘ఇలా ఎలా ఉన్నావు. అద్భుతం’ అన్నాడు అక్బర్‌. ‘ఈ చలిలో ఉండటం కష్టం. అయితే దూరం నుంచి ఈ సరస్సులో దీపం వెలుతురు పడుతోంది. ఆ వెలుతురు ఆసరాతో వెచ్చటి అనుభూతికి లోనయ్యాను అన్నాడు ఆ పేదవాడు. అక్బర్‌ కోపంతో ‘ఇది తప్పు’ అన్నాడు. ఆ పందెమూ లేదన్నాడు. అప్పుడు బీర్బల్‌ ఇలా అన్నారు. ‘రాజాగారు.. మీరు కోపంతో వ్యక్తిగతంగా ఈ సమస్యను తీసుకోవటం సబబు కాదు’ అని. అయినా అక్బర్‌ వినలేదు. ఆ బహుమతి ఇవ్వనన్నాడు. అప్పుడే ఆకలిగా ఉంది అన్నారు బీర్బల్‌. దగ్గరలో ఉండే ఓ ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి ఇల్లాలు గింజలు వేసి కుండకబెట్టబోతోంది. బీర్బల్‌ ఆమెతో ఇలా అన్నాడు.. పొయ్యిమీద కాకుండా పైన వేలాడదీయమన్నాడు ఆ కుండను. అదేంటీ అన్నాడు.. ఆ కింద ఉండే పొయ్యి వెలుగు ఆసరాగా ఉంటుంది కదా.. భోజనం అవుతుంది అన్నాడు బీర్బల్‌. దీంతో తప్పును తెలుసుకున్న అక్బర్‌ సిగ్గుపడ్డాడు. మరుసటి రోజు ఆ పేదవాడికి బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు అక్బర్‌.

Updated Date - 2023-12-06T02:34:19+05:30 IST