Story : చిక్కిపోయిన ‘అ’
ABN , Publish Date - Dec 30 , 2023 | 04:46 AM
పూర్వం ఒక ఊరిలో ఓ పండితుడు ఉండేవాడు. అతనికి మంచి పేరుంది. ఊరిలోనే కాదు పక్కన ఉండే పది గ్రామాల్లో పేరుంది.
పూర్వం ఒక ఊరిలో ఓ పండితుడు ఉండేవాడు. అతనికి మంచి పేరుంది. ఊరిలోనే కాదు పక్కన ఉండే పది గ్రామాల్లో పేరుంది. అయితే అతనికి ఓ కొడుకు ఉన్నాడు. కొట్టినా తిట్టినా కొడుక్కి చదువు అబ్బలేదు. పైగా బడికి వెళ్లకుండా పొలాలు, ఊర్లు తిరిగేవాడు. దీంతో అతనికి కనీసం చదవటం కూడా రాలేదు. తన బిడ్డ ఎప్పుడోకప్పుడు ఇబ్బంది పడతాడు అనుకుండేవాడు పండితుడు. అయితే అతని కొడుక్కు ఇవేమీ పట్టలేదు. జులాయిగా తిరిగాడు.
చూస్తుండగానే పండితుడు కొడుకు పెళ్లీడుకు వచ్చాయి. లక్షణమైన అమ్మాయితో పెళ్లి అయింది. పెళ్లి కొడుకు బావున్నాడని ఊరందరూ అన్నారు. అలా కాలం సాగిపోతోంది. ఒక రోజు పండక్కి తన అత్తగారింటికి వెళ్లాడు. అందరూ సందడిగా ఉన్నారు. పిల్లలు ఆటలాడుతున్నారు. అంతలోనే వారింటికి ఉత్తరం వచ్చింది. అది పల్లె అయిపాయ. తన పక్కింటి వాళ్లకు, తన ఇంటివాళ్లకూ.. ఎవరికీ చదవటం రాదు. దీంతో వెంటనే అత్తగారు.. తన అల్లుడి దగ్గరకు వచ్చింది. ఆ ఉత్తరం చదవాల్సిందిగా కోరింది.
అల్లుడు ఉత్తరాన్ని పట్టుకున్నాడు. ఒకటే ఏడుపు. ఆ ఏడుపు విని తన భార్యతో పాటు అత్త, మిగతా బంధువులు కూడా ఒకటే ఏడుపు. ఏమయ్యిందో.. ఏ చెడు వార్తోనని ఒకటే ఏడ్పు. అది చూసి అదే దారిలో ఓ బడి పంతులు ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు. విషయమేంటని అడిగి తెలుసుకున్నాడు. వెంటనే.. ఇదీ కథ అన్నారు. ఆ ఉత్తరాన్ని తీసుకున్నాక.. ‘పెళ్లి కొడుకు నాన్న ఇక్కడకు వస్తారంట పది రోజుల్లో. ఉండమని సమాచారం’ అన్నాడు ఆ పంతులు. ఆ శుభవార్తకు అల్లుడుగారు ఎందుకు ఏడుస్తున్నారో ఎవరికీ తెలీలేదు. ఎందుకింత బాధ అని తన భార్యతో పాటు తన అత్తమ్మ అడిగింది. అప్పుడు అల్లుడుగారు ఇలా అన్నారు.. ‘నేను చిన్నప్పుడు చదివిన ‘అ’ తాటికాయ అంత ఉంది. ఇప్పుడు చిన్నగా కుంచించుకుపోయింది. బాధగా ఉంది. అందుకే ఏడుస్తున్నా’ అన్నాడు.
అల్లుడిగారికి చదువు రాదనే విషయం అందరికీ అర్థమైంది.