The cowardly king: కోతల రాయుడు!

ABN , First Publish Date - 2023-07-26T00:44:48+05:30 IST

ఒక రాజ్యంలో ఓ పిరికి రాజు ఉండేవాడు. అతనికి ఏదైనా భయమే. తనమీదకు మరో రాజ్యాధినేత దండెత్తటం లాంటి పెద్ద విషయం కంటే అడవిలో దొంగలు పడ్డారన్నా సరే..

The cowardly king: కోతల రాయుడు!

ఒక రాజ్యంలో ఓ పిరికి రాజు ఉండేవాడు. అతనికి ఏదైనా భయమే. తనమీదకు మరో రాజ్యాధినేత దండెత్తటం లాంటి పెద్ద విషయం కంటే అడవిలో దొంగలు పడ్డారన్నా సరే.. ఊరికే కంగారు పడతారు ఆ రాజు. అయితే పైకి మాత్రం చాలా గంభీరంగా ఉండేవారు. ఒక రోజు ఎవరైనా ధీరులు ఉండే మనం వారిని ఉద్యోగులుగా నియమించుకుందాం.. అంటూ సభలో చెప్పారు. రాజుగారు దగ్గరుండి మరీ కొందరు వస్తాదులను చూస్తున్నారు. ఒక వస్తాదు రాజుగారి దగ్గరకు వచ్చి.. ‘‘నేను పర్వతాన్ని ఎత్తి పడేస్తాను. రోజుకు వంద లీటర్ల పాలు తాగుతా. సింహాలతో పోరాడతా’’ అంటూ చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యపోయారు. ఆ వస్తాదు వాలకం.. ఎత్తు, బరువు చూసి ‘ఇలాంటి ధీరుడు మన దేశంలో ఉండాల్సిందే’ అంటూ అతని ఉద్యోగిగా నియమించాడు.

ఆ వస్తాదు ప్రతి రోజూ మూడు పూట్ల తినటం, నిద్రపోవటం. అతని వాలకాన్ని చూసి చాలా మంది అసహ్యించుకునేవారు. అయితే రాజుకు అతని పరాక్రమం అంటే గొప్ప. ఒక రోజు దగ్గరి గ్రామంలో సింహాల గుంపు అక్కడి మేకలు, దున్నలు, గొర్రెలుతో పాటు జనాలను సంహరిస్తోంది. చేసేదేమీ లేక ఆ గ్రామ ప్రజలు రాజుగారి దగ్గరకు వచ్చారు. పరిస్థితిని వివరించారు. ‘ఓ.. ఇంతేనా మా వస్తాదు వస్తున్నాడు. ఆ సింహాల గుంపును మట్టికరిపిస్తాడు’ అంటూ వస్తాదును పిలిచాడు. విషయం చెప్పాడు. ‘అయ్యా.. మా గ్రామం దగ్గర పర్వతం ఉంది. దాని వల్లనే ఈ క్రూరమృగాలు వస్తున్నాయి. దయచేసి పర్వతాన్ని తీసేయించండి.. అన్నారు. మరుసటి రోజు వస్తామన్నారు రాజుగారు.

ఆ తర్వాత రోజే రాజుగారు, భటులు, వస్తాదు అంతా కలసి ఆ గ్రామానికి వెళ్లారు. ఈ పర్వతాన్ని అవతల పారేయ్‌ అన్నారు రాజుగారు. దీంతో వస్తాదు ఇలా అన్నాడు.. ‘రాజావారు.. మీరు పర్వతాన్ని తవ్వించండి’ అన్నాడు. రాజు బిత్తరపోయాడు. అదేంటీ? పర్వతాన్ని అవతల పారేస్తానన్నావు? అనడిగాడు. ‘అవును రాజావారు. పర్వతాన్ని ఎలా విసిరేశావు?’ లాంటి ప్రశ్నలు నన్ను అడగలేదే.. అంటూ అమాయకంగా చెప్పారు. రాజుకు చిర్రెత్తుకొచ్చింది. ఈ కోతలరాయుడిని బంధించండి. జీవిత ఖైదును చేయండి.. అంటూ ఆజ్ఞాపించాడు. అలా కోతలరాయుడి కథ ముగిసింది.

Updated Date - 2023-07-26T00:44:48+05:30 IST