Ugadi: ఉగాది పూట ఇలా చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించండి..!
ABN , First Publish Date - 2023-03-22T09:16:27+05:30 IST
మన పురాణాల్లో లెక్కలేనన్ని ఘట్టాలు ఉగాది రోజునే జరిగినట్టుగా లిఖితమై ఉన్నాయి.
ప్రతి పండుగకు ఒక ఆచారం, పద్దతి ఉంటాయి. ముఖ్యంగా మన తెలుగు పండుగైన ఉగాదిని మనమంతా కాస్త శ్రద్ధగా, ముఖ్యంగా రుచిగా చేసుకుంటూ ఉంటాం. పెద్దలు చెప్పిన విధంగా వేపపువ్వుతో, మామిడి తోరణాలతో, ఏడు రుచులతో మన ఉగాది చాలా శోభాయమానంగా ఉంటుంది. ఉగాది రోజున తెలుగు ఇళ్ళన్నీ కళ కళలాడిపోతాయి. ఈ పండుగ రోజునే బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడు. వైకుంఠనాథుడు మాత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంబరించి వేదాలను కాపాడింది ఈ ఉగాదినాడే.
ఉగాతి పండుగకు జతై ఎన్నో కథలున్నాయి. ఎన్నో సంఘటనలున్నాయి. మన పురాణాల్లో లెక్కలేనన్ని ఘట్టాలు ఉగాది రోజునే జరిగినట్టుగా లిఖితమై ఉన్నాయి. అయితే మనకు మాత్రమ ఉగాతి ఓ ప్రకృతి పండుగ. లేత వేప పువ్వు, లేలేత మావిచిగురు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, కొత్త కుండ ఇలా అన్నీ ప్రకృతిలో కొత్తగా పుట్టుకొచ్చిన ఆహారాలను కలిపి చేసేదే ఉగాది పచ్చడి.
ఉగాది రోజున ఇష్టదేవతలకు ఉదయం ఏడు నుంచి పది గంటల మధ్య ఎప్పుడైనా పూజించొచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే ఈరోజున రాశి ఫలాలను సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందోనని పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవాలి.
ఇది కూడా చదవండి: ఉగాది రోజున ఇలాంటి పనులు చేస్తే ఇక సంవత్సరం అంతా అదోగతే.. !
ఉగాది పర్వదినంలో ముఖ్యంగా రావాకు దీపాన్ని ఉంచడం వల్ల చాలా శుభాలు కలుగుతాయి. ఈ దీపాన్ని సాయంత్రం సమయంలో వెలిగించాలి. రావిచెట్టు ఆకులను దేవుని మందిరంలో పెట్టి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోష, కర్మ ఫలితాలు వుండవు. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి. దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.