Home » Ugadi
ఒమాన్ దేశంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలుగు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆధ్యాత్మికత వాతావరణంలో శోభాయమానంగా నిర్వహించారు.
తెలుగువారి నూతన సంవత్సరాదిని జిల్లా వాసులు ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరాన్ని భక్త్దిప్రపత్తులతో ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో విశేష పూజాకార్యక్రమాలు, పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించారు.
YS Jagan: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరుకాలేదు. దీంతో ఈ వేడుకలను పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు దగ్గరుండి జరిపించారు. ఈ వేడుకలకు వైఎస్ జగన్ హాజరు కాకపోవడంపై ఆ పార్టీలో నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Harish Rao: దేవాలయ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీన ప్రభుత్వ ఖజానా నుంచి కేసీఆర్ జీతాలు అందించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు చెప్పారు. ఎమ్మెల్యేగా సిద్దిపేటలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని, సీఎంగా దేశంలోనే మొట్ట మొదటి సారిగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ది అని హరీష్‌రావు చెప్పారు.
CM Chandrababu Naidu: రాజధాని అమరావతికి రైతులు పైసా తీసుకోకుండా రూ.33వేల ఎకరాలు ఇచ్చారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి ఇవ్వడం ప్రపంచంలోనే ఒక చరిత్ర అని అభివర్ణించారు. ఇప్పుడు వచ్చే ఆదాయనికంటే ఎక్కువ ఇస్తామని రైతులకు చెప్పామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహంచారు.
కొత్త ఏడాదిలో అదృష్టవంతులు ఎవరన్న వివరాలు, వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే.. ఆ రాశుల వారు జులై నుండి సెప్టెంబర్ వరకు శని ప్రభావం వల్ల కొన్ని అడ్డంకులు ఎదురవవచ్చు, కానీ ఓపికతో వాటిని అధిగమిస్తారని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉన్నప్పటికీ, వ్యయం అధికంగా ఉండవచ్చు కాబట్టి ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం.
మీరు కుంభ రాశిలో పుట్టారా.. మీకు ఈ ఏడాది సానుకూల ఫలితాలను సూచిస్తుంది. ముఖ్యంగా వృత్తిపరంగా, సామాజికంగా పురోగతి సాధించే kartఅవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా పెరుగుతుంది, వ్యయం నియంత్రణలో ఉంటుంది,
ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారాలను అందిస్తోంది. ఈ కార్యక్రమం విజయవాడలో నిర్వహిస్తోంది. సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారంలో కార్యక్రమాన్ని వీక్షించండి