Cutting Onions: ఈ చిన్న ట్రిక్ తెలియక ఎన్ని సార్లు ఏడ్చి ఉంటారో.. ఉల్లిపాయల్ని కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే..!

ABN , First Publish Date - 2023-07-15T12:54:55+05:30 IST

ఉల్లిపాయలో ఉండే కన్నీటిని కలిగించే రసాయనం పోయి ఉల్లిపాయను కోసేటప్పుడు కన్నీళ్లు రావు.

Cutting Onions: ఈ చిన్న ట్రిక్ తెలియక ఎన్ని సార్లు ఏడ్చి ఉంటారో.. ఉల్లిపాయల్ని కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే..!
cutting onions

రుచికరమైన కూరలోకి ఉల్లిపాయ లేకపోతే అదసలు కూరలానే అనిపించదు. కూరల రుచిని పెంచేది ఉల్లిపాయే. అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఉల్లిపాయ అందిస్తుంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనేది అందుకే. ఉల్లిపాయతో కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉన్నా, వీటిని ముక్కలుగా కోయాలంటే మాత్రం అందరికీ సమస్యే. కన్నీళ్ళను తెప్పించకుండా ఉల్లిపాయ కూరకు సిద్ధం కాదు. అందుకని ఉల్లిపాయలను కోయడం పెద్ద ఇబ్బందితో కూడుకున్న పని అనుకుంటాం.

ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నీళ్లు ఎందుకు వస్తాయి.

వీటిని కోసేటప్పుడు కన్నీళ్లు రావడానికి ఉల్లిపాయలలో లాక్రిమేటరీ-ఫాక్టర్ సింథేస్ ఎంజైమ్‌లు ఉంటాయి. మనం ఉల్లిపాయలను కోసినప్పుడు, ఈ ఎంజైమ్‌లు విడుదలై మన కళ్లపై ప్రభావం చూపుతాయి, దీని కారణంగా కళ్ల నుండి కన్నీళ్లు వస్తాయి. ఉల్లిపాయ కోసేటప్పుడు కాస్త భయపెట్టినా మంచి ఆరోగ్యాన్నే ఇస్తుంది.

ఇది కూడా చదవండి: గడువు ముగిసినా సరే.. ఈ ఆహార పదార్థాలను నిర్భయంగా తినొచ్చండోయ్..!


ఇక మగవారు కోయాల్సి వస్తే కళ్ళలో నీరు కారిపోతూ ఉంటే మరీ ఇబ్బంది పడుతూ కోస్తుంటారు. కత్తిరించడం వల్ల కళ్ళలో కన్నీళ్లు వస్తాయి. కళ్ళలో చికాకు కూడా వస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఉల్లిపాయను సులభంగా కోయడానికి కళ్లలో నీళ్లు రాకుండా ఉండటానికి ఏదైనా మార్గం ఉందా? అలాంటి 2 మార్గాలను తెలుసుకుందాం.

1. ఉల్లిపాయ పొట్టు తీసిన తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసి 10 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలో ఉండే కన్నీటిని కలిగించే రసాయనం తొలగిపోయి ఉల్లిపాయను కోసేటప్పుడు కన్నీళ్లు రావు. ఇది మామూలుగా మన పెద్దవాళ్ళు చేస్తున్నపనే.

2. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లు మండుతుంటే, చూయింగ్ గమ్ ను నోటిలో పెట్టుకుని, ఉల్లిపాయలు కోసేటప్పుడు నమలుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల కళ్లలో చుక్క కన్నీరు కూడా రాదు. దీనితో ఉల్లిపాయలను సులభంగా కోయవచ్చు.

Updated Date - 2023-07-15T12:54:55+05:30 IST