Cooking Tips: గంటల తరబడి వంటింట్లో మగ్గిపోతుంటారు కానీ.. ఈ ట్రిక్‌ను పాటిస్తే వంట పని చిటికెలో పూర్తి..!
ABN , First Publish Date - 2023-07-07T16:38:17+05:30 IST
ఈపేస్ట్ కూరకు మంచి రుచిని కూడా ఇస్తుంది.
రోజు వారి తీసుకునే ఆహారంలో ముఖ్య భాగాన్ని బియ్యం, కూరలతో నింపేస్తాం. ఇందులో ఏదీ తక్కువ రేటుకు రాదు. రోజు రోజుకూ రేట్లు పెరుగుతూ వచ్చే వాటిలో కూరగాయలు ముందుంటాయి. రోజుకో రేటుతో రోజుకో విధంగా పెరుగుతు, తగ్గుతూ పోతుంటాయి. ఇలాంటప్పుడు కూరగాయలను ముఖ్యంగా టమాటాలు, అల్లం, పచ్చిమిర్చి వంటి కూరగాయలను మార్కెట్ నుంచి తెచ్చుకుని పేస్టులా తయారు చేసి నిల్వ ఉంచుకోవచ్చు. ఇది చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.
ఈ మధ్య కాలంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాటాలు అయితే మరీను. ఇలా కూరగాయల ధరలు పెరుగుతున్నప్పుడే చిన్న చిన్న చిట్కాలతో వంటిల్లు బోసిపోకుండా, కూరలకు రుచి తగ్గకుండా చేసుకోవచ్చు. అదెలాగంటే..
అల్లం పేస్ట్
వంటకంలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉపయోగిస్తాం. కొంతమంది వీటిని కలిపి గ్రైండ్ చేయడానికి ఇష్టపడతారు, కొన్నిసార్లు వాటిని విడిగా సిద్ధం చేసి అవసరమైనప్పుడు కలపడం మంచిది. అల్లం తొక్కను సరిగ్గా తీసి, శుభ్రం చేసి, మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇది చాలా కాలం పాటు నిల్వ చేయవచ్చు.
టమాట గుజ్జు
టమాటోలు ఏదైనా వంటకానికి రుచి, రంగును ఇస్తాయి. కొన్ని తాజా, పండిన టమోటాలు ఎంచుకొని వాటిని బాగా వేయించాలి. ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి నిల్వ చేయవచ్చు. ఈ పేస్ట్ ని కూరల్లో ఉపయోగిస్తే రుచికి రుచి, అలాగే సమయం కూడా ఆదా అవుతుంది.
ఉల్లిపాయ పేస్ట్
ఉల్లిపాయ పేస్ట్ ను కూడా అప్పటికప్పుడు కాకుండా పేస్ట్ లా తయారు చేసి నిల్వ చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌లో ఉప్పు కలిపి కాస్త దగ్గరపడే వరకూ నూనెలో వేయించి ఈ మిశ్రమాన్ని నిల్వ ఉంచుకోవచ్చు. ఇది కూరలు తయారు చేసేప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి: నేరేడు పండ్లను తిన్న తర్వాత గింజలను పారేస్తున్నారా..? అయితే మీకీ విషయం తెలిసినట్టు లేదు..!
వెల్లుల్లి పేస్ట్
వెల్లుల్లి ని అల్లంతో కలిపి కానీ, విడిగా గానీ పేస్ట్ చేసి ఉంచుకోవచ్చు. ఇది కూరల్లో రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
పచ్చి మిరపకాయ పేస్ట్
పచ్చి మిరపకాయ పేస్ట్ చేయడానికి మిరపకాయలను బ్లెండర్లో వేసి, ఉప్పు, నిమ్మరసం వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈపేస్ట్ కూరకు మంచి రుచిని కూడా ఇస్తుంది.
పండు మిరపకాయ పేస్ట్
రెడీమేడ్ రెడ్ చిల్లీ పౌడర్‌కు బదులుగా రెడ్ చిల్లీ పేస్ట్ సిద్ధం చేసుకోవడం వల్ల మంచి రుచితోపాటు కూరకు మంచి రంగును కూడా ఇస్తుంది.