California Flooding: అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి ప్రకోపం.. మొన్నటి వరకు మంచు తుఫాన్.. ఇప్పుడేమో వర్షాలు..!

ABN , First Publish Date - 2023-01-11T09:17:42+05:30 IST

మొన్నటి వరకు మంచు తుఫాన్‌తో (Bomb Cyclone) గజగజ వణికిన అగ్రరాజ్యం అమెరికాను (America) ఇప్పుడు భారీ వర్షాలు (Heavy Rains) అతలాకుతలం చేస్తున్నాయి.

California Flooding: అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి ప్రకోపం.. మొన్నటి వరకు మంచు తుఫాన్.. ఇప్పుడేమో వర్షాలు..!

కాలిఫోర్నియా: మొన్నటి వరకు మంచు తుఫాన్‌తో (Bomb Cyclone) గజగజ వణికిన అగ్రరాజ్యం అమెరికాను (America) ఇప్పుడు భారీ వర్షాలు (Heavy Rains) అతలాకుతలం చేస్తున్నాయి. యూఎస్‌లోని కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్‌లో కొన్ని రోజులుగా ఎడతేరిపి లేకుండా వర్షాలు కూరుస్తుండడంతో వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. రహదారులన్ని జలశయాలను తలపిస్తున్నాయి. కాలిఫోర్నియాలోనైతే (California) పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ సుమారు 90శాతం మంది జనాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నారని సమాచారం. భీకర వరదల నేపథ్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని దాదాపు 25వేల మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు కాలిఫోర్నియాలో సోమవారం నాటికి వర్షాల కారణంగా 14 మంది వరకు మరణించి ఉంటారని తెలుస్తోంది.

Heavy-Rains.jpg

ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లోని స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. శాక్రమెంటో ఏరియాలో భారీ వృక్షాలు కూలి విద్యుత్ తీగలపైన పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక వరదల కారణంగా బురద ముప్పు పొంచి ఉందంటూ మాంటెసిటో నగర ప్రజలు వెంటనే వీడాల్సిందిగా అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. కాలిఫోర్నియాలో ఇప్పటికే పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండగా.. మరో 17 ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Updated Date - 2023-01-11T11:29:36+05:30 IST