NRI: మూడేళ్ల తరువాత మరోసారి వార్తల్లో నిలిచిన ఎన్నారై జంట..!

ABN , First Publish Date - 2023-01-08T18:40:37+05:30 IST

ఎన్నారైలు అమిత షా, ఆదిత్య మాదిరాజు మరోసారి వార్తల్లో నిలిచారు.

NRI: మూడేళ్ల తరువాత మరోసారి వార్తల్లో నిలిచిన ఎన్నారై జంట..!

ఎన్నారై డెస్క్: అమిత్ షా(Amit Shah).. ఆదిత్య మాదిరాజు(Aaditya madiraju)..ఈ పేర్లు ప్రస్తుతం ప్రజలు మర్చిపోయి ఉండొచ్చు కానీ 2019లో నెట్టింట చర్చ అంతా ఈ ఇద్దరి గురించే(Viral)! అప్పట్లో ఈ గే జంట(Gay couple) హిందూ సంప్రదాయం(Hindu Traditions) ప్రకారం పెళ్లాడి సంచలనం సృష్టించారు. వీరు దండలు మార్చుకుంటున్న ఫొటోలు ఓ సెన్సేషన్. మళ్లీ ఇన్నాళ్ల తరువాత ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. తొలిసారి తాము పేరెంట్స్ కాబోతున్నామంటూ వారు ప్రకటించారు. మే నెలలో తమ జీవితంలోకి ఓ పండంటి శిశువు రాబోతోందని మురిసిపోతూ చెప్పారు. తమ శిశివు స్కానింగ్ చిత్రాలతో చేసిన పెటర్నిటీ షూట్(Paternity shoot) ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ పత్రికకు ఈ జంట ఇంటర్వ్యూ ఇచ్చింది.

తాము తొలిసారి డేటింగ్ వెళ్లినప్పుడు పిల్లల గురించే మాట్లాడుకున్నామని ఆదిత్య తెలిపాడు. ‘‘పెళ్లి..పిల్లలు..మేము తొలిసారి కలుసుకున్న సందర్భంలోనే ఈ విషయాల గురించి చర్చిచాం. డేటింగ్ మొదట్లో జంటలు ఇలాంటి విషయాలు మాట్లాడుకునేందుకు ఇష్టపడవు. కానీ..మనసులో ఉన్నది ఉన్నట్టు చర్చించుకున్నాం కాబట్టే మేము ఇలా కలిసి ప్రయాణం చేస్తున్నాం’’ అని ఆదిత్య తెలిపాడు. ఇతర జంటల్లాగే తామూ భవిష్యత్తులో ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇతర పండుగలు జరుపుకుంటామని వారు తెలిపారు. బిడ్డ రాక తరువాత తమ జీవితం ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకునేందుకు ఉత్సుకతతో ఉన్నామని వారు మురిసిపోతూ చెప్పారు. వారి పెళ్లై మూడేళ్లు పూర్తైన సందర్భంలో ఆ జంట ఇటీవల పెద్ద ఎత్తున వేడుక చేసుకున్నారు. ‘‘నాకో కల ఉండేది..అది ఇప్పుడు నిజమైంది.దీన్ని నేను ఎప్పటికీ జాగ్రత్తగా పదిలపరుచుకుంటా’’ అంటూ ఆదిత్య అమిత్‌ను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.

Updated Date - 2023-01-08T18:55:34+05:30 IST