NRI: మారుతున్న ట్రెండ్! ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులను జాబ్ ఆఫర్స్ ఇస్తున్న అమెరికా సంస్థలు!

ABN , First Publish Date - 2023-03-12T20:17:47+05:30 IST

అమెరికా జాబ్ మార్కెట్‌లో ఎన్నారైలకు మేలు చేకూర్చే మార్పు కనిపిస్తున్నట్టు తాజాగా సర్వేలో బయటపడింది.

NRI: మారుతున్న ట్రెండ్! ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులను జాబ్ ఆఫర్స్ ఇస్తున్న అమెరికా సంస్థలు!

అమెరికా జాబ్ మార్కెట్‌లో ఎన్నారైలకు మేలు చేకూర్చే మార్పు కనిపిస్తున్నట్టు తాజాగా సర్వేలో బయటపడింది. ఇటీవలి లేఆఫ్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది హెచ్-1బీ వీసాదారులకు ఉద్యోగం ఇచ్చేందుకు కంపెనీలు ముందుకొస్తున్నట్టు తేలింది. ఎన్వాయ్ గ్లోబల్ (Envoy global) అనే సంస్థ జరిపిన సర్వే ఆశాజనకమైత పలు అంశాలు వెల్లడయ్యాయి.

వివిధ రంగాల్లోని అనేక కంపెనీల్లోని హెచ్‌ఆర్ శాఖ ఉద్యోగులను సర్వే చేసిన ఎన్వాయ్ గ్లోబల్ తన నివేదిక రూపొందించింది. ఇటీవలి లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులను ఉద్యోగంలోకి తీసుకున్నట్టు సర్వేలో పాల్గొన్న 51 శాతం కంపెనీలు తెలిపాయి(Companies hire laid off H-1B workers). అంతేకాకుండా.. 2022లో కంటే ప్రస్తుతం విదేశీ నిపుణులకు డిమాండ్ పెరిగిందట. గతేడాతి తొలి మూడునెలలతో పోలిస్తే ఈ ఏడాది విదేశీ నిపుణులను అధికంగా నియమించున్నట్టు 71 శాతం కంపెనీలు చెప్పాయి. అయితే..ఈ ఊపు ఇప్పట్లో తగ్గదని కూడా ఎన్వాయ్ గ్లోబల్ అంచనా వేస్తోంది. ఈ మారు హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ల సంఖ్య 2022 కంటే కాస్తంత ఎక్కువ ఉండొచ్చని పేర్కొంది.

ఇక విదేశీ నిపుణులకు డిమాండ్ ఉన్నా వీసా నిబంధనలు అడ్డొస్తుండటంతో అనేక కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లాయి. 80 శాతం కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పేరిట వారి స్వస్థలాలకు తరలించాయి. మరికొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల కెనడా, మెక్సికో, బ్రిటన్ దేశాల్లోని బ్రాంచ్‌లకు బదిలీ చేశాయి. ఇక 86 శాతం అమెరికా కంపెనీలు విదేశాల్లో ఉంటున్న వారినే నేరుగా పనిలోకి తీసుకున్నాయి. వీటితో పాటూ విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికన్ కంపెనీలు..అంతర్జాతీయ స్థాయిలో ఓ గ్లోబల్ ఎంప్లాయ్‌మెంట్ సంస్థను కూడా ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నాయట.

Updated Date - 2023-03-12T20:17:47+05:30 IST