USA: అమెరికాలో విమానాలు స్తంభించిపోవడానికి కారణం ఇదే.. ఇద్దరు ఉద్యోగులు..
ABN , First Publish Date - 2023-01-13T18:45:01+05:30 IST
అమెరికాలో బుధవారం సాంకేతిక సమస్య కారణంగా వేల సంఖ్యలో విమానాలు నిలిచిపోవడం వెనుక ఇద్దరు ఉద్యోగుల తప్పిదమే కారణమని తాజాగా తేలింది.
ఎన్నారై డెస్క్: అమెరికాలో బుధవారం సాంకేతిక సమస్య కారణంగా వేల సంఖ్యలో విమానాలు నిలిచిపోవడం(US Departure Halt) వెనుక ఇద్దరు ఉద్యోగుల తప్పిదమే కారణమని తాజాగా తేలింది. విమానయానానికి కీలకమైన నోటామ్(Notam) వ్యవస్థ అకస్మాత్తుగా స్తంభించిపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యమైన విషయం తెలిసిందే. విమాన టేకాఫ్, ల్యాండింగ్‌కు అవసరమై కీలకమైన సమాచారాన్ని అటు విమానాలకు ఇటు విమానాశ్రయాలకు అందించే నోటామ్ వ్యవస్థ(Notam) అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఈ వ్యవస్థకు సంబంధించి ఓ ఫైల్‌లో సమాచారదోషంతో ఇలా జరిగింది అమెరికా పౌరవిమానయాన శాఖ(FAA) అధికారులు తాజాగా తేల్చారు. నిబంధనల ప్రకారం నోటామ్‌పై పనిచేసే ఉద్యో్గులు లైవ్ డాటాలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకూడదు. ఇందుకు సంబంధించి అమెరికా పౌర విమానయాన స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే.. ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రభుత్వ సూచనలు పాటించకపోవడంతో ఫైల్‌లో లోపం తలెత్తింది. ఈ ఘటన వెనుక దురుద్దేశం ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ప్రస్తుతం సాధారణ స్థితి నెలకొందని అక్కడి వార్గాలు తెలిపాయి.