Bahrain: ఉద్యోగార్థులకు బహ్రెయిన్ అలెర్ట్.. అలాంటి రిక్రూట్‌మెంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ..

ABN , First Publish Date - 2023-04-20T08:18:24+05:30 IST

దేశవ్యాప్తంగా రోజురోజుకి ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ స్కామ్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో బహ్రెయిన్ (Bahrain) అలెర్ట్ వార్న్ చేసింది.

Bahrain: ఉద్యోగార్థులకు బహ్రెయిన్ అలెర్ట్.. అలాంటి రిక్రూట్‌మెంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ..

మనామా: దేశవ్యాప్తంగా రోజురోజుకి ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ స్కామ్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో బహ్రెయిన్ (Bahrain) అలెర్ట్ వార్న్ చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు ఆన్‌లైన్ వేదికగా వచ్చే తప్పుడు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బోగస్ జాబ్ రిక్రూట్‌మెంట్లపై జాగ్రత్తగా ఉండాలని కోరింది. జెన్యూన్ జాబ్ పోర్టల్స్‌ను పరిశీలించిన తర్వాత వాటి తాలూకు అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలని ఉద్యోగార్థులను బహ్రెయిన్ అధికారులు కోరారు. ఉద్యోగార్థులను సంప్రదించడానికి మోసగాళ్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ (Instagram), లింక్డ్‌ఇన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్‌లైన్ ప్రకటనలను ఇస్తారని గుర్తు చేశారు.

అనేక సందర్భాల్లో సుల్తానేట్‌లో మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు (Jobs) కల్పిస్తామని హామీ ఇచ్చే ఏజెంట్లు ప్రాసెసింగ్ ఫీజు (Processing Fee) పేరిట ఉద్యోగార్థుల నుంచి భారీ మొత్తంలో దండుకుని మోసం చేస్తారని, ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే వివిధ లింకులతో సోషల్ మీడియాలో (Social Media) ఉద్యోగార్థులను ఆకర్షిస్తూ కొందరు కేటుగాళ్లు డబ్బు మోసాలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. ఇటీవల కొన్ని సంస్థలు ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రముఖ సోషల్ మీడియా సైట్స్‌తో సహా అనేక జాబ్ పోర్ట్‌ల్స్‌లో (Job Portals) నకిలీ ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో ఈ వార్నింగ్ అలెర్ట్‌ను అధికారులు జారీ చేయడం జరిగింది.

Kuwait: బీకేర్‌ఫుల్ ప్రవాసులూ.. ఈ తప్పు చేశారో.. మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్.. కువైత్ బ్యాంకుల నయా కండీషన్..!


Updated Date - 2023-04-20T08:18:47+05:30 IST