NRI: భారతీయ మహిళకు ఆఫీసులో వేధింపులు..భారీ పరిహారం చెల్లించనున్న రాయల్ మెయిల్ సర్వీస్

ABN , First Publish Date - 2023-07-08T22:09:35+05:30 IST

అన్యాయంగా ఉద్యోగం కోల్పోయిన ఓ భారతీయ మహిళకు న్యాయపోరాటం చేసి విజయం సాధించింది. బాధితురాలికి తక్షణం 2,50,000 పౌండ్ల తక్షణ పరిహారం చెల్లించాలని బ్రిటన్‌లోని ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్ రాయల్ మెయిల్ పోస్టల్ సర్వీసును తాజాగా ఆదేశించింది.

NRI: భారతీయ మహిళకు ఆఫీసులో వేధింపులు..భారీ పరిహారం చెల్లించనున్న రాయల్ మెయిల్ సర్వీస్

ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లో అన్యాయంగా ఉద్యోగం కోల్పోయిన ఓ భారతీయ మహిళ న్యాయపోరాటం చేసి విజయం సాధించింది. బాధితురాలికి తక్షణం 2,50,000 పౌండ్ల తక్షణ పరిహారం చెల్లించాలని అక్కడి ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్ రాయల్ మెయిల్ పోస్టల్ సర్వీసును తాజాగా ఆదేశించింది. రాయల్ మెయిల్ సర్వీసు చరిత్రలో ఇంతటి పరిహారం చెల్లించాల్సి రావడం ముందెప్పుడూ చూడలేదని అక్కడి మీడియా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే, 2013లో కామ్ ఝటి రాయల్ మెయిల్ సర్వీసులో మీడియా స్పెషలిస్టుగా ఉద్యోగంలో చేరింది. అయితే, తన సహోద్యోగి అక్రమంగా బోనస్ పొందాడన్న విషయాన్ని గుర్తించి పైఅధికారికి ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలు నిజమని తేలిననాటి నుంచి ఝుటికి వేధింపులు మొదలయ్యాయి. బాస్ ఆమెను నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే ఆమెకు కంపెనీ మరో బాధ్యతలు అప్పగించింది. కానీ ఆమె ఆశించిన పనితీరు కనబరచట్లేదని, ఒత్తిడి ఎదుర్కుంటోందనీ 2014లో విధుల నుంచి తప్పించింది.

తనకు అన్యాయం జరిగిందని భావించిన ఆమె తొలుత న్యాయపోరాటం ప్రారంభించింది. ఈ క్రమంలో ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్ తాజాగా తీర్పు వెలువరించింది. రాయల్ మెయిల్ ఆమెకు పరిహారం(Compensation) కింద 2.3 మిలియన్ పౌండ్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లే అవకావం ఉండటంతో కంపెనీ తక్షణ పరిహారం కింద 2,50,000 పౌండ్లు చెల్లించాలని ఆదేశించింది.

Updated Date - 2023-07-08T22:41:21+05:30 IST