Canada: కెనడా ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం అమల్లోకి.. రెండేళ్లపాటు విదేశీయులు..
ABN , First Publish Date - 2023-01-02T12:48:23+05:30 IST
కెనడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విదేశీయులు కెనడా(Canada)లో ఇళ్లు కొనడానికి వీలు లేకుండా రెండేళ్లపాటు నిషేధం విధించింది. కొవిడ్..
ఎన్నారై డెస్క్: కెనడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విదేశీయులు కెనడా(Canada)లో ఇళ్లు కొనడానికి వీలు లేకుండా రెండేళ్లపాటు నిషేధం విధించింది. కొవిడ్ ప్రభావం మొదలైనప్పటి నుంచి విదేశీయులు సేఫ్టీ పెట్టుబుడులలో భాగంగా.. రెసిడెన్షియల్ ప్రాపర్టీల(Bans Buying Residential Properties) మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో కెనడాలో ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి.
దీంతో తమ దేశ పౌరుల ప్రయోజనాలపై కెనడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కెనడాలో విదేశీయులు(Foreigners) ఇళ్లు కొనడానికి వీలు లేకుండా రెండేళ్లపాటు నిషేధం విధిస్తూ కొన్ని రోజుల క్రితమే చట్టాన్ని రూపొందించి ఆమోదం తెలిపింది. ఆ చట్టం జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే.. ఇమ్మిగ్రేంట్స్‌కు, కెనడా పౌరసత్వం పొందని పర్మినెంట్ రెసిడెంట్లకు ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇలా చేయడం ద్వారా ఇళ్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయనేది కెనడా ప్రభుత్వ ఆలోచన.