NRI: భారతీయ భాషా వైవిధ్యంపై బ్రిటన్ పార్లమెంటరీ హౌస్‌లో ప్రత్యేక కార్యక్రమం

ABN , First Publish Date - 2023-05-28T20:47:07+05:30 IST

ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినం సందర్భంగా భారత్‌లోని భాషా వైవిధ్యం గొప్పదనాన్ని చాటిచెప్పేలా బ్రిటన్‌లోని సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

NRI: భారతీయ భాషా వైవిధ్యంపై బ్రిటన్ పార్లమెంటరీ హౌస్‌లో ప్రత్యేక కార్యక్రమం

ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినం సందర్భంగా భారత్‌లోని భాషా వైవిధ్యం గొప్పదనాన్ని చాటిచెప్పేలా బ్రిటన్‌లోని సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. చార్టెర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లింగ్వెస్టిక్స్, ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ సహకారంతో బ్రిటీష్ పార్లమెంటరీ హౌస్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గార్డెన్ ఆఫ్ ఫ్రాగ్నాల్ బెరోనెస్ పాల్గొన్నారు. ఆధునిక భాషల సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని ఆమె వివరించారు. వివిధ భాషలకు సంబంధించి సాహిత్య విలువున్న సమాచారాన్ని ప్రదర్శించిన కార్యక్రమ నిర్వహకులను ఆమె అభినందించారు.

2.jpg

బ్రిటన్‌లోని పలువురు భారత సంతతి ప్రముఖులు భారతీయ భాషల్లో తాము రాసిన పద్యాలను ఈ కార్యక్రమంలో చదివి వినిపించారు. తెలుగు, సంస్కృతం, అస్సామీస్, బెంగాలీ, డోగ్రీ, గజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మైథిలీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, సింధీ, నేపాలీ భాషల్లోని సాహిత్యాన్ని వినిపించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో అంతరించిపోయే దశకు చేరుకున్న టాయ్ ఖమ్తీ భాష గురించి సంస్కృతి సెంటర్‌ వ్యవస్థాపకురాలు రాగసుధ వింజమూరి ప్రసంగించారు. ప్రస్తుతం ఈ భాషను కేవలం 20 వేల మంది మాత్రమే మాట్లాడుతున్నారని ఆమె తెలిపారు. ఈ భాషను కాపాడేందుకు కోసం టాయ్ ఖమ్తీ హెరిటేజ్ అండ్ లిటరేచర్ సొసైటీ వంటి ఎన్జీఓ సంస్థలు శ్రమిస్తున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్లు, కౌన్సిలర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్టిసులు, ఐటీ నిపుణులతో పాటూ వివిధ రంగాలకు చెందిన పలువురు తాము రచించిన పద్యాలను చదివి వినిపించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా భారతీయ హైకమిషన్ అధికారి డా. నందిత సాహూ అంత్యోపన్యాసం ఇచ్చారు. ఈ ఈవెంట్‌లో నిధి మెహతా, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మిన్‌స్టర్‌కు చెందిన ప్రొఫెసర్ టెర్రీ లాంబ్, ఫిలిప్ హార్డింగ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-28T21:30:41+05:30 IST