74th Republic Day: ఒమన్‌లోని భారతీయులకు రాయబారి రిపబ్లిక్ డే విషెస్
ABN , First Publish Date - 2023-01-26T11:09:02+05:30 IST
భారత 74వ రిపబ్లిక్ డే (74th Republic Day) సందర్భంగా ఒమన్‌లో ఉంటున్న భారతీయులకు (Indians) భారత రాయబారి హెచ్ఈ అమిత్ నారంగ్ (HE Amit Narang) విషెస్ తెలియజేశారు.
మస్కట్: భారత 74వ రిపబ్లిక్ డే (74th Republic Day) సందర్భంగా ఒమన్‌లో ఉంటున్న భారతీయులకు (Indians) భారత రాయబారి హెచ్ఈ అమిత్ నారంగ్ (HE Amit Narang) విషెస్ తెలియజేశారు. ఈ ఏడాది జీ-20 అధ్యక్ష బాధ్యతలు కలిగి ఉన్న ఈ గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైందిగా ఆయన పేర్కొన్నారు. అలాగే తన జీ-20 ప్రెసిడెన్సీలో ఒమన్ సుల్తానేట్‌ను (Oman Sultanet) తన ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం ఎంతో గౌరవంగా ఉందని తెలిపారు. ఇది భారత్, ఒమన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత దృఢ పరుస్తుందని చెప్పారు. 10ఏళ్ల క్రిత ఇండియా జీడీపీ ప్రపంచంలో 11వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు అది 5వ స్థానానికి చేరడం గర్వకారణం అన్నారు.
అంతేగాక 2030 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి వరల్డ్‌లోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని రాయబారి (Indian Ambassador) చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారత జీడీపీ 3.5 ట్రిలియన్ డాలర్లు ఉంటే.. ఇది 2030 నాటికి 7.5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసిన విషయాన్ని ఈ సందర్భంగా అమిత్ నారంగ్ గుర్తు చేశారు. ఇక 2021-22లో ఇండియా-ఒమన్ ద్వైపాక్షిక వాణిజ్యం గతేడాది కంటే సుమారు 90శాతం పెరిగి, 10బిలియన్ల డాలర్లకు చేరిందని తెలిపారు.