Mahzooz Prize: 'హమ్మయ్యా.. ఇక హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు'

ABN , First Publish Date - 2023-02-09T10:46:15+05:30 IST

'హమ్మయ్యా.. ఇక హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు' ఇది యూఏఈలో ఉంటున్న ఓ ప్రవాస భారతీయుడు (Indian Expat) చెబుతున్న మాట.

Mahzooz Prize: 'హమ్మయ్యా.. ఇక హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు'

అబుదాబి: 'హమ్మయ్యా.. ఇక హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు' ఇది యూఏఈలో ఉంటున్న ఓ ప్రవాస భారతీయుడు (Indian Expat) చెబుతున్న మాట. తాజాగా మహజూజ్ డ్రాలో (Mahzooz Draw) 1లక్ష దిర్హమ్స్ (రూ.22.50లక్షలు) గెలుచుకున్న 32ఏళ్ల భారత ప్రవాసుడు మహమ్మద్ నోటి వెంట వచ్చిన మాట ఇది. వివరాల్లోకి వెళ్తే.. స్వదేశంలో ఉపాధి కరువై కొన్నేళ్ల క్రితం మహమ్మద్ యూఏఈ (UAE) వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొంతకాలంగా మహజూజ్ డ్రాలో పాల్గొంటున్నాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో మహమ్మద్‌‌కు ఏకంగా 1లక్ష దిర్హమ్స్ (రూ.22.50లక్షలు) జాక్‌పాట్ తగిలింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు.

ఇన్నాళ్లు తనకు వచ్చే జీతంలో తన ఖర్చులకు పోగా, మిగిలినవి ఇంటికి పంపించడంతో అక్కడిది అక్కడే సరిపోయేది. దాంతో నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయేదని వాపోయాడు. దాంతో తన స్నేహితుల సలహా మేరకు కొన్ని నెలల నుంచి మహజూజ్ డ్రాలో పాల్గొంటున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో గత శనివారం నిర్వహించిన డ్రాలో రూ.22.50లక్షలు గెలుచుకున్నట్లు తెలిపాడు. ఇన్నాళ్లు పెళ్లి చేసుకుంటే మిగతా ఖర్చులకు ఎలా అని ఆలోచించివాడినని, ఇప్పుడు తాను గెలుచుకున్న డబ్బుతో ఆ లోటు ఉండదని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు హ్యాపీ పెళ్లి చేసుకోవచ్చని మహమ్మద్ మురిసిపోతున్నాడు. ఇక ఇదే డ్రాలో మహమ్మద్‌తో పాటు మరో ఇద్దరు ఫిలిప్పీన్స్ ప్రవాసులు కూడా చెరో లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నారు.

ఇది కూడా చదవండి: రూ. 32 వేల కోట్లు కొట్టేసిన లేడీ కిలాడీ.. ఐదేళ్లుగా ఎఫ్‌బీఐ వేట.. ఇప్పుడు ఎక్కడ ?

Updated Date - 2023-02-09T14:04:09+05:30 IST