NRI: భారతీయుడిని అందరూ చూస్తుండగానే కాల్చి చంపిన ఆస్ట్రేలియా పోలీసులు.. ఇంతకీ అతడు చేసిన నేరమేంటంటే..

ABN , First Publish Date - 2023-03-01T09:07:33+05:30 IST

ఆస్ట్రేలియా రాజధాని నగరం సిడ్నీలో (Sydney) మంగళవారం పోలీసులు ఓ భారతీయుడిని (Indian) కాల్చి చంపారు.

NRI: భారతీయుడిని అందరూ చూస్తుండగానే కాల్చి చంపిన ఆస్ట్రేలియా పోలీసులు.. ఇంతకీ అతడు చేసిన నేరమేంటంటే..

మెల్‌‌బోర్న్: ఆస్ట్రేలియా రాజధాని నగరం సిడ్నీలో (Sydney) మంగళవారం పోలీసులు ఓ భారతీయుడిని (Indian) కాల్చి చంపారు. రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను పొడిచి పారిపోతున్న భారత వ్యక్తిని ఆస్ట్రేలియన్ పోలీసులు (Australian Police) అడ్డుకున్నారు. కానీ, అతడు వారిపై కూడా దాడికి యత్నించాడు. దాంతో పోలీసులు భారతీయుడిపై కాల్పులు జరిపారు. బుల్లెట్లు అతడి ఛాతీ భాగంలో తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన మహమ్మద్ రహమత్ సయ్యద్ అహ్మద్ (32) బ్రిడ్జింగ్ వీసాపై (Bridging visa) ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. మంగళవారం సిడ్నీ వెస్ట్‌లోని ఔబర్న్ ట్రై స్టేషన్‌కు (Auburn train station) వెళ్లిన అహ్మద్ అక్కడ ఓ క్లీనర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపాయేందుకు ప్రయత్నించాడు. అయితే, సమాచారం అందుకున్న ఔబర్న్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అతడిని లొంగిపోవాలని కోరారు.

కానీ, అహ్మద్ వారిపై కూడా దాడికి యత్నించాడు. దాంతో పోలీసులు చేసేదేమిలేక అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మూడు బుల్లెట్లు అహ్మద్ ఛాతీ భాగంలో తగిలాయి. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. కొనఊపిరీతో ఉన్ అతడిని పోలీసులు దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై న్యూ సౌత్ వేల్స్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ స్టువార్ట్ మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. మొదట మేము భారత వ్యక్తిని తాము లొంగిపోవాలని కోరాము. కానీ, అతడు పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. దాంతో చేసేదేమిలేక ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు. ఈ ఘటనపై కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (Consulate General of India) కూడా స్పందించింది. అసలేం జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు విచారణ జరిపిస్తామని తెలిపింది.

ఇది కూడా చదవండి: బ్లూ కాలర్ వర్కర్స్, విజిట్ వీసాదారులకు ఈ 7 రెస్టారెంట్లలో ఉచిత భోజనం..

Updated Date - 2023-03-01T09:07:33+05:30 IST