Viral Video: అప్పటివరకు ఎంతో హుషారుగా బ్యాడ్మింటన్ ఆడిన భారతీయుడు.. క్షణాల వ్యవధిలోనే..
ABN , First Publish Date - 2023-01-12T10:49:18+05:30 IST
అప్పటివరకు ఎంతో హుషారుగా బ్యాడ్మింటన్ ఆడిన భారత వ్యక్తి (Indian) ఉన్నట్టుండి కోర్టులోనే కుప్పకూలి, అక్కడే ప్రాణాలొదిన విషాద ఘటన మస్కట్‌లో (Muscat) చోటు చేసుకుంది.
మస్కట్: అప్పటివరకు ఎంతో హుషారుగా బ్యాడ్మింటన్ ఆడిన భారత వ్యక్తి (Indian) ఉన్నట్టుండి కోర్టులోనే కుప్పకూలి, అక్కడే ప్రాణాలొదిన విషాద ఘటన మస్కట్‌లో (Muscat) చోటు చేసుకుంది. ఈ ఘటన ఈ నెల 2వ తేదీన జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ అవుతోంది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. నలుగురు స్నేహితులు బ్యాడ్మింటన్ (Badminton) ఆడుతూ కనిస్తున్నారు. ఎంతో ఎంజాయ్ చేస్తూ నలుగురు ఆటాడుతున్న దృశ్యాలు వీడియోలో (Video) చూడొచ్చు. అయితే, క్షణాల వ్యవధిలోనే అక్కడ పరిస్థితి అంతా మారిపోయింది. అప్పటివరకు ఎంతో హుషారుగా కనిపించిన ఆ నలుగురిలోని ఓ వ్యక్తి ఆటాడుతూనే బ్యాడ్మింటన్ కోర్టులోనే కుప్పకూలిపోయాడు.
దాంతో ఏం జరిగిందో తెలియక కంగారుపడ్డ మిగిలిన మిత్రులు అతడిని పైకి లేపేందుకు ప్రయత్నించారు. కానీ, ఎంతకు అతడు లేవకపోవడంతో హూటాహూటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బ్యాడ్మింటన్ కోర్టులోనే ఆకస్మిక గుండెపోటుతో (Heart Attack) అతడు ప్రాణాలొదినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక ఆ వ్యక్తి అప్పటివరకు ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇప్పుడీ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, మృతుడిది కేరళ రాష్ట్రంగా తెలుస్తోంది.