Qatar: భారతీయ అల్ట్రా రన్నర్ సుఫియా సూఫీ మరో వరల్డ్ రికార్డు

ABN , First Publish Date - 2023-01-14T10:55:00+05:30 IST

భారతీయ అల్ట్రా రన్నర్ (Indian Ultrarunner) సుఫియా సూఫీ ఖాన్ (Sufiya Sufi Khan) మరో గిన్నీస్ వరల్డ్ రికార్డు (Guinness World Records) సృష్టించారు.

Qatar: భారతీయ అల్ట్రా రన్నర్ సుఫియా సూఫీ మరో వరల్డ్ రికార్డు

దోహా: భారతీయ అల్ట్రా రన్నర్ (Indian Ultrarunner) సుఫియా సూఫీ ఖాన్ (Sufiya Sufi Khan) మరో గిన్నీస్ వరల్డ్ రికార్డు (Guinness World Records) సృష్టించారు. 200 కిలోమీటర్ల సౌత్ టు నార్త్ అల్ట్రామారథాన్ రన్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఈ నెల 12న ఉదయం అబూ సమ్రా నుంచి ప్రారంభమైన రన్ తర్వాతి రోజు మధ్యాహ్నం అల్ రువైస్‌లోని జులాల్ వెల్నెస్ రిసార్ట్‌లో ముగిసింది. 30 గంటల 34 నిమిషాల్లో ప్రో-అథ్లెట్ 'ఫాస్టెస్ రన్ అక్రాస్ ఖతార్'లో (Fastest Run across Qatar) భాగంగా తన మొదటి అంతర్జాతీయ సాహసయాత్రను పూర్తి చేశారు. తద్వారా మరో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఇప్పటికే సూఫీ తన లాంగ్ రన్‌తో మూడుసార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకెక్కారు.

ఇక తన తదుపరి లక్ష్యం కాలినడకన ప్రపంచాన్ని చుట్టిరావడమేనని తెలిపారు. దానిని సాధించడానికి తన తాను సిద్ధం చేసుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. కాగా, 37 ఏళ్ల అల్ట్రా రన్నర్ సూఫీ ఖాన్ ఇండియా వ్యాప్తంగా సుదూర పరుగు లక్ష్యాలను సాధించడంలో ప్రసిద్ధి చెందారు. 2019లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగంగా ప్రయాణించిన మహిళగా, 2021లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ రన్‌ను పూర్తి చేసిన మహిళగా, 2022లో మనాలి-లేహ్ హిమాలయన్ అల్ట్రా రన్ ఛాలెంజ్‌ను కవర్ చేసిన మహిళగా ఆమె వరల్డ్ రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-14T10:57:24+05:30 IST