Kuwait: లైసెన్స్ లేకుండా అలా చేయడం తప్పు.. చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం!
ABN , First Publish Date - 2023-01-07T10:17:40+05:30 IST
చట్టాలను కఠినంగా అమలు చేస్తున్న దేశాలా జాబితాలో కువైత్ కూడా ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమంగా ట్యూషన్లు చెబుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు కువైత్(Kuwait Govt) సిద్ధమైంది. ముఖ్యంగా విదేశీ పౌరులు నడుపుతున్న ..
ఎన్నారై డెస్క్: చట్టాలను కఠినంగా అమలు చేస్తున్న దేశాలా జాబితాలో కువైత్ కూడా ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమంగా ట్యూషన్లు చెబుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు కువైత్(Kuwait Govt) సిద్ధమైంది. ముఖ్యంగా విదేశీ పౌరులు నడుపుతున్న ట్యూషన్ సెంటర్లపై ఉక్కుపాదం వేసేందుకు కువైత్ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. దేశం నుంచి బహిష్కరించేందుకు ఉపక్రమించింది. ఈ విషయంపై అక్కడి స్థానిక మీడియా తాజాగా కథనాలు వెలువరించింది. ఈ నేపథ్యంలో లైసెన్సులు తీసుకోకుండా చట్టవిరుద్ధంగా ప్రవాసులు నడుపుతున్న ట్యూషన్ సెంటర్ల(Illegal Tuition Centers)పై కువైత్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. సదరు ట్యూషన్ సెంటర్లకు సంబంధించిన ప్రకటనలను ప్రచురించిన మ్యాగజైన్‌లపై చర్యలు తప్పవట.
ఇన్‌స్టిట్యూషన్లలో ఉద్యోగం పొందే ముందు.. ప్రైవేటు ట్యూషన్లు నడపను అంటూ ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్ట్‌లపై సంతకాలు చేసి కూడా ప్రవాసులు ఆ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారట. ఈ క్రమంలోనే పబ్లిక్ పరీక్షలు తదిరత సమయాల్లో ఇల్లీగల్ ట్యూషన్ సెంటర్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయట. దీంతో ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వ ఇన్‌స్టిట్యూషన్ల(Government Institutions)లో పని చేస్తూ అక్రమంగా ప్రైవేటు ట్యూషన్ సెంటర్ల నడుపుతున్న టీచర్ల వివరాలు ఇప్పటికే కువైత్ విద్యాశాఖ ఉన్నత అధికారులకు అందినట్టు తెలుస్తోంది.