Golden Visas: 2022లో 80వేల గోల్డెన్ వీసాలు జారీ

ABN , First Publish Date - 2023-01-14T09:12:57+05:30 IST

విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాలు (Golden Visas) ఇస్తోంది.

Golden Visas: 2022లో 80వేల గోల్డెన్ వీసాలు జారీ

దుబాయ్: విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాలు (Golden Visas) ఇస్తోంది. 10, 5 ఏళ్ల పరిమితితో ఈ వీసాలను జారీ చేస్తోంది. వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన వారు, పెట్టుబడిదారులు, ఇతర కేటగిరీల వారికి ఇలా యేటా భారీ సంఖ్యలో గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తోంది. దీనిలో భాగంగా 2022లో 80వేల వరకు వీసాలు మంజూరు చేసింది. ఈ మేరకు తాజాగా దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (General Directorate of Residency and Foreigners Affairs) వెల్లడించింది.

జీడీఆర్ఎఫ్ఏ (GDRFA) సమాచారం ప్రకారం అన్ని కేటగిరీలకు కలిపి 79,617 గోల్డెన్ వీసాలు జారీ చేసినట్లు పేర్కొంది. అంతకుముందు ఏడాది (2021) ఈ సంఖ్య 47,150 మాత్రమే. అంటే 2022లో దాదాపు రెట్టింపు అయింది. అలాగే గతేడాది డైరెక్టరేట్ మొత్తంగా 62.24 మిలియన్ల ట్రాన్సక్షన్స్ చేసింది. ఇందులో 46,965,715 ఎంట్రీ, ఎగ్జిట్ (వాయు, రోడ్డు, సముద్ర ప్రయాణాలకు సంబంధించినవి) ట్రాన్సక్షన్స్ ఉన్నాయి. అలాగే వీసా (9,852,218 ), రెసిడెన్సీ (4,499,712), ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్ (40,642), లీగల్ కన్సల్టేషన్స్ (37,267) ట్రాన్సక్షన్స్ ఉన్నాయి. ఇక జీడీఆర్ఎఫ్ఏ దాని కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడంలో 99 శాతం సక్సెస్ రేటును సాధించింది. అలాగే కస్టమర్ హ్యాపీనెస్ ఇండెక్స్ 96 శాతం దాటగా.. భాగస్వామి హ్యాపీనెస్ ఇండెక్స్ 100 శాతానికి చేరుకుంది.

Updated Date - 2023-01-14T10:00:55+05:30 IST