Share News

NRI: ఓటేద్దామని సప్త సాగరాలు దాటి వస్తే.. ఎన్నారైకి షాకింగ్ అనుభవం..!

ABN , First Publish Date - 2023-12-02T08:39:52+05:30 IST

NRI Missing Vote in Mancherial District: ఓ వ్యక్తి రాష్ట్రంలో ఓటు హక్కు ఉంది కదా అని సప్తసాగరాలు దాటి వచ్చాడు. తీరా.. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆ ఎన్నారైకి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓటు వేద్దామని పోలింగ్​ కేంద్రానికి వెళ్తే అక్కడ తన ఓటు లేకపోవడం చూసి నిర్ఘాంతపోయాడు.

NRI: ఓటేద్దామని సప్త సాగరాలు దాటి వస్తే.. ఎన్నారైకి షాకింగ్ అనుభవం..!

NRI Missing Vote in Mancherial District: పక్క రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లిన తెలంగాణ వాసులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుగానే వారి సొంతూళ్లకు చేరుకున్నారు. నవంబర్ 30న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఇలా చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి మరి తమ ఓటు వేశారు. అయితే, ఓ వ్యక్తి రాష్ట్రంలో ఓటు హక్కు ఉంది కదా అని సప్తసాగరాలు దాటి వచ్చాడు. తీరా.. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆ ఎన్నారైకి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓటు వేద్దామని పోలింగ్​ కేంద్రానికి వెళ్తే అక్కడ తన ఓటు లేకపోవడం చూసి నిర్ఘాంతపోయాడు. ఓటరు జాబితాలో తన పేరు లేదనే విషయం అక్కడి పోలింగ్ అధికారులు చెప్పడంతో మనోడు షాక్ అయ్యాడు. అయ్యో.. ఓటేద్దామని రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తే ఇలా జరిగిందేంటని తలపట్టుకోవడం ఎన్నారై వంతైంది.

NRIs: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. ముగ్గురు నరరూప రాక్షసులు.. 20 ఏళ్ల యువకుడిని 7నెలల పాటు..!

అసలేం జరిగిందంటే..

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన పూదరి శ్రీనివాస్ గడిచిన 15 ఏళ్లుగా న్యూజిలాండ్‌లో ఉంటున్నాడు. అక్కడి ఓ కంపెనీలో వెల్డర్‌గా పనిచేస్తూ, కుటుంబంతో కలిసి అక్కడే స్థిరపడ్డాడు. ఇక నవంబర్ 30న ఎన్నికలు ఉండడంతో వారం రోజుల ముందు తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫ్యామిలీతో కలిసి స్వగ్రామానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ నుంచి స్వదేశానికి బయల్దేరడానికి ముందే తన స్నేహితుడు వాట్సాప్ ద్వారా పంపించిన ఓటరు జాబితాలో తన పేరుతో పాటు భార్య లావణ్య పేరు కూడా ఉండడం చూశాడు. దాంతో వెంటనే భార్యతో కలిసి ఇండియాకు వచ్చేశాడు.

NRIs: భారత పర్యాటకులకు తీపి కబురు.. వీసా ఫ్రీ ఎంట్రీకి మరో దేశం గ్రీన్ సిగ్నల్..!

గురువారం రోజు ఓటు వేసేందుకు చింతగూడలోని పోలింగ్ బూత్ నంబర్ 296కు వెళ్లాడు. అయితే, అక్కడి అధికారులు ఎన్నికల జాబితాను పరిశీలించి అందులో శ్రీనివాస్ పేరు లేదని చెప్పారు. అతని భార్య పేరు మాత్రమే ఉందని చెప్పడంతో షాక్ అయ్యాడు. సవరించిన ఎన్నికల జాబితాలో శ్రీనివాస్ పేరును తొలగించడమే దీనికి కారణం అని అధికారులు తెలియజేశారు. దీంతో చేసేదేమిలేక శ్రీనివాస్ ఓటు వేయకుండానే పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి వచ్చేశాడు. కాగా, అతను ఓటు వేసేందుకు స్వదేశానికి రావడానికి ఏకంగా రూ.2.50 లక్షలు ఖర్చు చేయడం, ఇప్పుడు అదంతా వృధా కావడం జరిగింది.

Kuwait: ప్రవాసులకు హెచ్చరిక.. రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించారో అంతే సంగతులు..!


Updated Date - 2023-12-02T08:39:54+05:30 IST