Residence Visa: రిటైర్డ్ ప్రవాసులకు యూఏఈ తీపి కబురు.. ఇకపై..

ABN , First Publish Date - 2023-06-03T10:28:52+05:30 IST

పదవీ విరమణ పొందిన ప్రవాసులకు (Retired Expatriates) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ప్రభుత్వం తాజాగా తీపి కబురు చెప్పింది.

Residence Visa: రిటైర్డ్ ప్రవాసులకు యూఏఈ తీపి కబురు.. ఇకపై..

అబుదాబి: పదవీ విరమణ పొందిన ప్రవాసులకు (Retired Expatriates) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ప్రభుత్వం తాజాగా తీపి కబురు చెప్పింది. ఐదేళ్ల కాలపరిమితితో రెసిడెన్స్ వీసా (Residence Visa) పొందే సౌకర్యాన్ని కల్పించింది. ఈ మేరకు యూఏఈ డిజిటల్ గవర్నమెంట్ (UAE DGov) తాజాగా కీలక ప్రకటన చేసింది. అర్హులైన రిటైర్డ్ ప్రవాసులు ఈ 5ఏళ్ల రెసిడెన్సీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 55ఏళ్లకు పైబడిన వలసదారులు యూఏఈ నివాసం ఉండేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అలాగే ఈ రెసిడెన్సీ వీసాను రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందని పేర్కొంది. ఇతర వివరాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://www.visitdubai.com/ar/retire-in-dubai/plan-your-retirement లో లాగిన్ కావాలని తెలిపింది.

వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు..

* పదవీ విమరణకు ముందు కనీసం 15 ఏళ్ల పాటు దేశం బయట గానీ, లోపల గానీ సర్వీస్ చేసి ఉండాలి.

* 55 ఏళ్లకు తగ్గకుండా వయసు ఉండాలి.

* ఒక మిలియన్ దిర్హమ్స్‌ వరకు బ్యాంక్ ఖాతాలో సేవింగ్స్ ఉండాలి. లేదా మంత్లీ ఆదాయం 20వేల దిర్హమ్స్ తప్పనిసరి.

* ఆదాయం, సేవింగ్స్‌ను ధృవీకరిస్తూ ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.

Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..

Updated Date - 2023-06-03T10:28:52+05:30 IST