NRI: సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో లండన్‌లో ‘శివోహం’
ABN , First Publish Date - 2023-02-26T19:25:14+05:30 IST
సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24న లండన్‌లోని శివోహం పేరిట ఓ నృత్య కార్యక్రమం జరిగింది.
సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24న లండన్‌లోని శివోహం పేరిట ఓ నృత్యకార్యక్రమం జరిగింది. నగరంలోని భారతీయ విద్యాభవన్ వేదికగా ఈ నృత్యప్రదర్శన జరిగింది. బ్రిటన్‌లో తొలిసారిగా సప్త తాండవ థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు.. కూచిపూడి, భరతనాట్యం, యక్షగాన, ఒడిస్సి, కథక్, మోహినీయట్టం నృత్యరీతులను ప్రదర్శించారు.
తొలుత ఈ కార్యక్రమంలో 20 మంది నాట్యకళాకారుల ప్రదర్శనతో ప్రాంగణం పంచాక్షరీ మంత్రంతో మారుమోగిపోయింది. ఈ కార్యక్రమానికి ఇండియన్ హైకమిషన్ మినిస్టర్(కల్చర్ అండ్ ఎడ్యుకేషన్), శివ ట్రైలజీ రచయిత అమిశ్ త్రిపాఠి హాజరయ్యారు. హైదరాబాద్‌కు చెందిన నాట్యకళాకారిణి రాగసుధ వింజమూరి.. సప్త తాండవం థీమ్‌కు రూపకల్పన చేశారు. సప్త నాట్యరీతుల్లో ఒకదాన్ని స్వయంగా ప్రదర్శించారు. విద్యాభవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. నందకుమార..కళాకారులకు ఆర్మ్‌లెట్స్‌తో సత్కరించారు. కార్యక్రమానికి రాధిక జోషి, రాజ్ అగర్వాల్ వ్యాఖ్యాతలుగా వ్యవహించారు.