Pravasi Bharatiya Divas: ప్రవాసీ దివస్‌లో తెలుగు ప్రవాసీయులు
ABN , First Publish Date - 2023-01-11T18:00:42+05:30 IST
కేంద్ర ప్రభుత్వం 17వ ప్రవాసీ దివస్(Pravasi Bharatiya Divas-2023)ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో యూఏఈ(UAE), గల్ఫ్(Gulf)లోని ఇతర దేశాల్లో నివాసం ఉంటున్న తెలుగు..
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం 17వ ప్రవాసీ దివస్(Pravasi Bharatiya Divas-2023)ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో యూఏఈ(UAE), గల్ఫ్(Gulf)లోని ఇతర దేశాల్లో నివాసం ఉంటున్న తెలుగు ప్రవాసీయులు(NRI) కూడా కొంత మంది పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి యస్.జయశంకర్ ప్రారంభించిన సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ములతో పాటు ఇతర కేంద్ర మంత్రులు ప్రవాసీ దివస్ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు.
దుబాయి నుంచి కుంభాల మహేందర్ రెడ్డి (రాజన్న సిరిసిల్లా జిల్లా), బాలు బొమ్మిడి (తిరుమనపల్లి, నిజామాబాద్ జిల్లా), భోగ వేణుగోపాల్ (చౌటపల్లి, నిజామాబాద్ జిల్లా), కచ్చు కొమరయ్య (అబ్బపూర్, పెద్దపల్లి జిల్లా) ఈ కర్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సౌదీ అరేబియాలోని రియాధ్ నుంచి అంటోని(హైదరాబాద్), ఖతర్ నుంచి రజనీ కుమారి (అనంతపురం), ఒమాన్ నుంచి పన్నేరు నరేంద్ర (జగిత్యాల)లతో పాటు మరికొందరు పాల్గొన్నారు.
తెలుగు ప్రవాసీయులను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు కార్యక్రమాల్లో ప్రజలందర్నీ భాగస్వామ్యం చేస్తుందనే విషయం మరోసారి నిరూపితం అయిందని మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సారి దుబాయి నుంచి ప్రత్యేకంగా విద్యార్థులు, కార్మికులను ఉచితంగా ప్రవాసీ దివస్ సమ్మేళానికి తీసుకెళ్ళినట్లుగా ఆయన పెర్కోన్నారు.