UAE Driving Licence: ఈ ఒక్క లైసెన్స్‌తో ఎన్ని దేశాల్లో డ్రైవింగ్ చేయడానికి వీలు కలుగుతుందంటే..
ABN , First Publish Date - 2023-01-19T09:02:52+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలలో యూఏఈ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌కు గుర్తింపు ఉందని యూఏఈ అంతర్గత మంత్రిత్వశాఖ (UAE Ministry of Interior) వెల్లడించింది.
అబుదాబి: ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలలో యూఏఈ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌కు గుర్తింపు ఉందని యూఏఈ అంతర్గత మంత్రిత్వశాఖ (UAE Ministry of Interior) వెల్లడించింది. ఆయా దేశాలలోని యూఏఈ పౌరులు వారి వాహనాలను ఈ డ్రైవింగ్ లైసెన్స్‌తో (UAE Driving Licence) ఎలాంటి షరతులు లేకుండా డ్రైవ్ చేయవచ్చని పేర్కొంది. యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటయ్యే దేశాల జాబితాలో ఎస్టోనియా, అల్బేనియా, పోర్చుగల్, హంగేరి, గ్రీస్, ఉక్రెయిన్, బల్గేరియా, స్లోవేకియా, స్లోవేనియా, సెర్బియా, సైప్రస్, లాట్వియా, లక్సెంబర్గ్, లిథువేనియా, మాల్టా, ఐస్‌లాండ్, మాంటెనెగ్రో, బ్రిటన్, ఆస్ట్రియా, డెన్మార్క్, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ కొరియా, పోలాండ్, ఫిన్లాండ్, చైనా ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా యూఏఈ గుర్తించిన 43 దేశాల పౌరులు యూఏఈ సందర్శన సమయంలో వారి డ్రైవింగ్ లైసెన్సులను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.