UAE Visa: విజిటర్లకు యూఏఈ గుడ్‌న్యూస్.. విజిటింగ్ వీసాపై 90రోజుల స్టే

ABN , First Publish Date - 2023-06-15T08:30:15+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మూడు నెలల విజిట్ వీసాను తిరిగి ప్రవేశపెట్టింది. గతేడాది చివరలో 90 రోజుల వ్యవధితో ఇచ్చే ఈ వీసాను రద్దు చేసింది.

UAE Visa: విజిటర్లకు యూఏఈ గుడ్‌న్యూస్.. విజిటింగ్ వీసాపై 90రోజుల స్టే

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సందర్శకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మూడు నెలల విజిట్ వీసాను తిరిగి ప్రవేశపెట్టింది. గతేడాది చివరలో 90 రోజుల వ్యవధితో ఇచ్చే ఈ వీసాను రద్దు చేసింది. ఇప్పుడీదే వీసాను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (Federal Authority For Identity, Citizenship, Customs & Port Security) వెల్లడించింది. ఎక్కువ కాలంలో యూఏఈని విజిట్ చేయాలనుకునే సందర్శకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరింది. ఇక యూఏఈలో ప్రస్తుతం రెండు రకాల ఎంట్రీ పర్మిట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి టూరిస్ట్ వీసా లేదా లీజర్ వీసా కాగా, రెండోది విజిట్ వీసా. టూరిస్ట్ వీసా అనేది 30 లేదా 60 రోజుల కాలపరిమితితో జారీ చేయబడుతుంది. అదే విజిట్ వీసా ఏకంగా 3నెలల వ్యవధితితో వస్తుంది.

కాగా, ఈ వీసా కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దుబాయ్, అబుదాబిలలో విజిట్ వీసా చెల్లుబాటు అవుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక విజిట్ వీసా రుసుము విషయానికి వస్తే.. ప్రారంభ ధర 1500 దిర్హమ్స్ (రూ.33,565) గా ఉంది. సర్వీస్ అందించే ప్రయాణ ఏజెన్సీలను బట్టి దీని ధర మారుతుంది. కాగా, ఈ వీసా దరఖాస్తుకు ఇటీవల తీయించుకున్న పాస్‌పోర్ట్‌సైజ్ కలర్ ఫొటో, పాస్‌పోర్ట్ కాపీ ఉండే సరిపోతుంది. దరఖాస్తు చేసుకున్న ఐదు వర్కింగ్ డేస్‌లో వీసా జారీ అవుతుంది.

Indian Origin: యూకేలో ఘోరం.. భారత సంతతి టీనేజర్ దారుణ హత్య!


Updated Date - 2023-06-15T08:30:15+05:30 IST