ABN Fact Check : గుడివాడలో నానిని దెబ్బకొట్టేందుకు ‘నారా’స్త్రం.. నిజంగానే నారా రోహిత్‌ బరిలోకి దిగుతున్నారా..!?

ABN , First Publish Date - 2023-08-01T13:19:56+05:30 IST

రోహిత్ నిజంగానే రాజకీయాల్లోకి (Nara Rohit Politics) వస్తున్నారా..? సినిమాలకు స్వస్తి చెప్పేస్తున్నారా..? రాజకీయాల్లోకి వస్తే పోటీచేస్తారా..? అసలు గుడివాడ నుంచి పోటీ చేస్తారనడంలో నిజమెంత..? అనే విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిజనిర్ధారణ (ABN-Andhrajyothy Fact Check) చేసింది...

ABN Fact Check : గుడివాడలో నానిని దెబ్బకొట్టేందుకు ‘నారా’స్త్రం.. నిజంగానే నారా రోహిత్‌ బరిలోకి దిగుతున్నారా..!?

అవును.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి (MLA Kodali Nani) చెక్ పెట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Nara Chandrababu) ‘నారా’స్త్రం (Narastram) సంధించబోతున్నారు.! నానిపై తన సోదరుడి కుమారుడు, టాలీవుడ్ హీరో నారా రోహిత్‌ను (Hero Nara Rohit) ఒకప్పటి టీడీపీ కంచుకోట గుడివాడ (Gudivada) నుంచి బాబు పోటీచేయించబోతున్నారు..! ‘ప్రతినిధి-2’ మూవీ (Pratinidhi-2) పూర్తయ్యాక ఇక రాజకీయ కదనరంగంలోకి ఆయన దిగబోతున్నారు..!. ఇక వైసీపీకి (YSR Congress) దబిడిదిబిడే..! ఈ దెబ్బతో నాని రాజకీయ జీవితం ముగిసినట్లే..! ఇవీ గత వారం రోజులుగా అటు సోషల్ మీడియాలో.. ఇటు కొన్ని వెబ్‌సైట్లలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న వార్తలు, ప్రత్యేక కథనాలు. అయితే.. రోహిత్ నిజంగానే రాజకీయాల్లోకి (Nara Rohit Politics) వస్తున్నారా..? సినిమాలకు స్వస్తి చెప్పేస్తున్నారా..? రాజకీయాల్లోకి వస్తే పోటీచేస్తారా..? అసలు గుడివాడ నుంచి పోటీ చేస్తారనడంలో నిజమెంత..? అనే విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిజనిర్ధారణ (ABN-Andhrajyothy Fact Check) చేసింది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూసేద్దాం రండి..!

ABN ఛానల్ ఫాలో అవ్వండి

WhatsApp Image 2023-08-01 at 11.57.11 AM.jpeg

ఇదీ అసలు కథ..!

ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక నియోజకవర్గం గుడివాడ. ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోట అనే విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కూడా ఇక్కడ్నుంచే 1983, 1985 నుంచి రెండుసార్లు పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 1989లో మాత్రమే కాంగ్రెస్ (Congress) గెలిచింది. అప్పట్నుంచీ 1994, 1999, 2000 ఉపఎన్నిక, 2004, 2009 వరకూ నాన్ స్టాప్‌గా సైకిల్ స్పీడ్ మీదే ఉన్నది. రెండుసార్లు టీడీపీ తరఫునే కొడాలి నాని కూడా గెలిచారు. ఆ తర్వాత వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) సమక్షంలో వైసీపీలో చేరిన నాని.. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫునే గెలిచారు. అయితే.. ఈయన గెలిచింది అంతంత మాత్రం మెజార్టీతోనే టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి.. అస్తమాను టీడీపీపైనా, చంద్రబాబుపైనా నోరుపారేసుకుంటున్న నానికి చెక్ పెట్టాలన్నది అధిష్టానం ప్లాన్. ఈ క్రమంలో నానిని హ్యాట్రిక్ కొట్టకుండా దెబ్బకొట్టేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. నానిపై పోటీచేస్తూ వస్తున్న రావి వెంకటేశ్వర్లను (Ravi Venkateswarlu) పక్కనెట్టి హీరో నందమూరి తారకరత్నను (Nandamuri Tarakaratna) బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ఆ మధ్య తారకరత్న కూడా గుడివాడలో విస్తృతంగా పర్యటించడం, సేవా కార్యక్రమాలు చేయడం, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలు కూడా చేపట్టారు. టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురవ్వడం, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాత హిందూపురం ఎమ్మెల్యే, సీనియర్ నటుడు బాలకృష్ణ.. తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. కొద్దిరోజులకు సుహాసిని పేరు కూడా వచ్చింది. ఇవన్నీ అయ్యాక.. ఏపీలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో నారా రోహిత్ పేరు తెరపైకి వచ్చింది. గత వారం, పదిరోజులుగా ఎక్కడ చూసినా ఇవే వార్తలు కనిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు పెద్దఎత్తున వైరల్ చేస్తుండగా ఇందులో నిజానిజాలెంత అని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఫ్యాక్ట్ చెక్ చేసింది.

WhatsApp Image 2023-08-01 at 12.02.08 PM.jpeg

ఏబీఎన్ ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిదంటే..?

రోహిత్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తున్నారా..? ఇందులో నిజమెంత..? అని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంప్రదించగా అదంతా అబద్ధమేనని.. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా సినిమాలపైనేనని స్పష్టం చేశారు. అయితే.. ‘పెదనాన్న చంద్రబాబు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను’ అని రోహిత్ ఏబీఎన్‌కు తెలిపారు. సో.. దీన్ని బట్టి చూస్తే రాజకీయాల్లోకి రావాలని కాస్త ఆసక్తి చూపిస్తున్నట్లే ఉందని అర్థం చేసుకోవచ్చు. మరి చంద్రబాబు మనసులో ఏముంది..? ఎన్నికల ముందు రోహిత్‌ను బరిలోకి దింపుతారా..? అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి. కాగా.. ప్రస్తుతం పొలిటికల్ డ్రామా బ్యాగ్రౌండ్‌లో సాగే ‘ప్రతినిధి-2’ సినిమాలో రోహిత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల ముందు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా తర్వాత ఒకట్రెండు సినిమాలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Nara-Rohit.jpg

మొత్తానికి చూస్తే.. ప్రస్తుతానికి సినిమాలపైనే ఫోకస్ అని.. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని క్లియర్ కట్‌గా నారా రోహిత్ చెప్పేశారు. భవిష్యత్తులో రాజకీయ అరంగేట్రం జరగొచ్చేమో చెప్పలేం. రీల్ లైఫ్‌లో పొలిటిషియన్‌గా, రాజకీయ నేతలను వణికించిన పాత్రల్లో నటించిన రోహిత్.. రియల్‌ లైఫ్‌లో ఆ చాన్స్ ఎప్పుడొస్తుందో మరి. సో.. ఇకనైనా రోహిత్‌పైన వస్తున్న వార్తలు ఆగుతాయేమో వేచి చూడాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి


TS Politics : కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం.. దాసోజుకు లక్కీ ఛాన్స్.. దానంకు లైన్ క్లియర్!


TSRTC : ఎన్నికల ముందు కేసీఆర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం


Manoj Meets CBN : చంద్రబాబుతో భేటీ తర్వాత మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫిక్స్ అయినట్లే..!


AP Politics : చంద్రబాబు నివాసానికి మంచు మనోజ్.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ.. ఇందుకేనా..!?



Updated Date - 2023-08-01T13:29:55+05:30 IST