BRS Mla Candidates : షాకింగ్ సర్వే.. ఈ జిల్లాల నుంచి ఇంతమంది సిట్టింగ్‌లకు కేసీఆర్ టికెట్లు ఇవ్వట్లేదా.. వణికిపోతున్న ఎమ్మెల్యేలు..!?

ABN , First Publish Date - 2023-07-08T22:51:00+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు (Congress, BJP) ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రగతి భవన్ వేదికగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని వాళ్లంతా సిట్టింగ్‌లేనని పదే పదే గులాబీ బాస్ చెబుతున్నారు. అయితే లోలోపల మాత్రం సీన్ వేరేలా ఉందని తెలుస్తోంది...

BRS Mla Candidates : షాకింగ్ సర్వే.. ఈ జిల్లాల నుంచి ఇంతమంది సిట్టింగ్‌లకు కేసీఆర్ టికెట్లు ఇవ్వట్లేదా.. వణికిపోతున్న ఎమ్మెల్యేలు..!?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు (Congress, BJP) ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రగతి భవన్ వేదికగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని వాళ్లంతా సిట్టింగ్‌లేనని పదే పదే గులాబీ బాస్ చెబుతున్నారు. అయితే లోలోపల మాత్రం సీన్ వేరేలా ఉందని తెలుస్తోంది. సారు చెప్పిన మాటతో సిట్టింగ్‌లు కాస్త రిలీఫ్ అయినా ఈ లోపే బాంబ్ లాంటి వార్త బయటికొచ్చింది. ఇటీవల పార్టీ ప్రత్యేకంగా చేయించిన సర్వేలో 30 మంది సిట్టింగ్‌లకు (30 Mlas) ఇస్తే.. ఫలితాలు తారుమారవుతాయని తేలిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయం బయటికి పొక్కడంతో సిట్టింగుల్లో మళ్లీ టెన్షన్ మొదలైందట. మరోవైపు ఆశావహులు కూడా ఈసారైనా సారు కనికరిస్తారేమో అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన నేతకు టికెట్ రాకపోతే పరిస్థేంటి..? అని ఆయా ఎమ్మెల్యేల అనుచరులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.


BRS.jpg

ఇదీ అసలు కథ..?

జూలూ-15న 80 మంది అభ్యర్థులతో తొలిజాబితాను కేసీఆర్ ప్రకటించబోతున్నారని గత నెలరోజులుగా జాతీయ మీడియా, తెలుగు రాష్ట్రాల ప్రముఖ చానెల్స్‌లో ప్రత్యేక కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే మిగిలిన స్థానాలకు కొత్త వ్యక్తులు, పొత్తుల్లో పంపకాల తర్వాత ఈ నెలాఖరున మరో జాబితా రానుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఉమ్మడి జిల్లాల వారిగా చేసిన రహస్య సర్వే ప్రకారం 30 మంది సిట్టింగ్‌లపై పూర్తి వ్యతిరేకత ఉందని తేలినట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నివేదికలు కేసీఆర్ చేతికొచ్చాయట. దీంతో ఆ 30 మందిని పక్కనెట్టేయాల్సిందేనని ప్రగతి భవన్ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రేంజ్‌లో వ్యతిరేకత రావడానికి ప్రభుత్వ పథకాలైన దళితబంధు ప్రభావమేనని తేలిందని తెలుస్తోంది. వాస్తవానికి ఆ మధ్య బీజేపీ, కాంగ్రెస్ ముఖ్యంగా వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేదల సొమ్మును తిన్న ఎమ్మెల్యేలు వీరేనంటూ పేర్లతో సహా ఆయా నియోజకవర్గాల పర్యటనలో చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో నిజమెంత..? అసలు ఆ సిట్టింగ్‌ల గ్రాఫ్ ఏ మాత్రం ఉంది..? అని మూడో కంటికి తెలియకుండా సీక్రెట్‌గా సర్వే చేయిస్తే అసలు విషయం బయటిపడిందట.

kcr1.jpg

ఎవరెవరున్నారు..?

సర్వేలో తేలిన సమాచారం మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నలుగురు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇద్దరు, నిజామాబాద్ నుంచి ఇద్దరు, ఖమ్మం నుంచి ముగ్గురు, వరంగల్‌లో నలుగురు, మెదక్ నుంచి నలుగురు, కరీంనగర్ నుంచి ముగ్గురు, రంగారెడ్డి నుంచి నలుగురు, ఇక మిగిలిన వారు హైదరాబాద్, ఆదిలాబాద్‌కు చెందిన కొందరు సిట్టింగులని తెలిసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జాబితా గురించే చర్చ జరుగుతోంది. అంతేకాదు.. బీఆర్ఎస్‌కు చెందిన ముఖ్య కార్యకర్తలే ఈ సమాచారాన్ని వైరల్ చేస్తుండటంతో ఈ వార్తలు, సర్వేకు మరింత బలం చేకూరుతోంది.

KCR-BRS-Formation-Day.jpg

ఏం చేస్తారో.. ఏంటో..?

ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పటికే కేసీఆర్, హరీష్, కేటీఆర్‌లు జిల్లాల పర్యటనలో భాగంగా, కొందర్ని ప్రగతి భవన్‌కు పిలిపించి మరీ టికెట్లు కన్ఫామ్ చేశారు. ఇలా సుమారు 10 నుంచి 17 మందికి ముందే చెప్పేశారు. అయితే ఇప్పుడు 30 మంది సిట్టింగులను ఎలా సర్దుబాటు చేయాలి..? వారి స్థానంలో పక్క పార్టీ వాళ్లను తీసుకోవాలా..? లేకుంటే ఎమ్మెల్యే తర్వాత ఇంకెవరున్నారు..? క్యాడర్ ఎవరివైపు ఉంది..? ఇలా అన్ని బేరీజు చేసుకునే పనిలో ప్రగతి భవన్ పెద్దలు ఉన్నారని బీఆర్ఎస్ కీలక నేత ఒకరు చెప్పారు. అయితే వీరందరికీ టికెట్ ఇవ్వమనే విషయం ఇప్పటికిప్పుడు చెప్పకుండా ఆగస్టులో జాబితా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలియవచ్చింది. ఇలా వరుస కథనాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో వణుకు మొదలైంది. దీంతో కొందరు నష్ట నివారణ చర్యల్లో మునగగా.. మరికొందరు సొంతంగా సర్వేలు చేయించి గులాబీ బాస్ దగ్గరికెళ్లాలని భావిస్తున్నారట. ఫైనల్‌గా ఏం తేలుతుందో.. ఈ 30 మందే కాకుండా ఇంకెంత మంది ఉన్నారని తేలుతుందో తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి


Rajyasabha : ఎన్నికల ముందు బీజేపీ వ్యూహాత్మక అడుగులు.. రాజ్యసభకు ‘తెలుగోడు’..!


YS Sharmila : వైఎస్సార్ జయంతి ముందురోజే వైఎస్ షర్మిల ఆసక్తికర నిర్ణయం.. అదేంటో తెలిస్తే..!


Modi TS Tour : మోదీ వరంగల్ వచ్చివెళ్లాక తెలంగాణ బీజేపీలో ఒకటే గుసగుస.. దేని గురించంటే..?


Jagan Vs Sharmila : వైఎస్సార్ జయంతి సాక్షిగా వైఎస్ జగన్ రెడ్డి వర్సెస్ షర్మిల.. ప్రత్యేకంగా ఫోన్లు చేసి మరీ..!


Updated Date - 2023-07-08T22:56:03+05:30 IST