YSRCP Targets Chiru : రీల్ ‘BRO’తో మొదలై ‘రియల్ బ్రో’ చిరు దగ్గర బ్లాస్ట్.. రేపొద్దున ఇదేగానీ జరిగితే వైసీపీ పరిస్థితి ఊహకందేనా..!?
ABN , First Publish Date - 2023-08-08T18:11:18+05:30 IST
‘బ్రో’ సినిమాలో (BRO Cinema) ఇమిటేషన్‌తో మొదలైన వివాదం.. రెమ్యునరేషన్ (Remuneration) వరకూ వెళ్లింది..! జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) రెమ్యునరేషన్ ఎంతో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకు మొత్తం బ్లాక్ మనీ వాడారని అది చాలా చేతులు మారిందని ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చగా మారాయి..
‘బ్రో’ సినిమాలో (BRO Cinema) ఇమిటేషన్‌తో మొదలైన వివాదం.. రెమ్యునరేషన్ (Remuneration) వరకూ వెళ్లింది..! జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) రెమ్యునరేషన్ ఎంతో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకు మొత్తం బ్లాక్ మనీ వాడారని అది చాలా చేతులు మారిందని ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చగా మారాయి. ఈ వ్యవహారంపై పనిగట్టుకుని మరీ ఢిల్లీకెళ్లి ఫిర్యాదు చేసొచ్చారు. వారం, పదిరోజులపాటు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఇదే పంచాయితీనే నడిచింది. ఇప్పుడిప్పుడు కాస్త సద్దుమణిగిందనుకున్న ఈ వ్యవహారం.. ‘బోళా శంకర్’ (Bhola Shankar) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమెడియన్ హైపర్ ఆది (Hyper Adi) వ్యాఖ్యలతో మళ్లీ మొదలైంది. ఆ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్పందించలేదు కానీ.. ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ (Valtheru Veerayya) 200 రోజుల వేడుకలో చిరు రియాక్ట్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు (YSRCP Leaders) ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి మూకుమ్మడిగా మాటలదాడికి దిగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పొలిటికల్ వర్సెస్ సిల్వర్ స్క్రీన్ (Political Vs Silver Screen) వార్‌తో ఏపీ రాజకీయాలు (AP Politics) హీటెక్కాయి. ఇంతకీ చిరు ఏమన్నారు..? ఆయన మాటల్లో వైసీపీకి (YSRCP) అంత తప్పేం కనపడింది..? ఏపీ మంత్రుల ఏమన్నారు..? పవన్ రీల్ ‘బ్రో’ (Ree Bro) మొదలైన ఈ వివాదాన్ని ‘రియల్ బ్రో’ (Real Bro) సీరియస్‌గా తీసుకున్నారా..? ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ పట్టించుకోని పరిస్థితుల్లో జగన్‌ను అభినందించినందుకు ఇదేనా ఆయనకిచ్చే గౌరవం..? అనే ఇంట్రస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనం.
ఎందుకింత రచ్చ..!?
వైసీపీ (YSR Congress) అధికారంలోకి వచ్చాక.. అన్ని పరిశ్రమల వారు.. అన్ని వర్గాల వారు వెళ్లి సీఎం వైఎస్ జగన్ రెడ్డిని (CM Jagan Reddy) అభినందించారు.! అయితే ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ వెళ్లలేదు..! టాలీవుడ్ (Tollywood) పెద్ద దిక్కుగా చిరంజీవి చొరవ తీసుకుని వెళ్లి మరీ కంగ్రాట్స్ తెలిపారు. ఆ తర్వాత ఒకసారి వ్యక్తిగతంగా వెళ్లడం, టికెట్ల విషయంలో, షూటింగ్ విషయాల్లో అలా రెండు, మూడు సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లతో వెళ్లి కలిసొచ్చారు. పలు సినిమాల టికెట్ రేట్ల పెంపు విషయంలో.. ఇలా చాలా సందర్భాల్లో ఒకే అభిప్రాయాలతో ముందుకెళ్లారు. దీంతో అంతా కలిసిపోయారు.. సాఫీగానే ఉందనుకున్నారు కానీ.. ‘బ్రో’ సినిమాలో మంత్రి అంబటిని ఇమిటేట్ చేశారని.. వైసీపీ రగిలిపోయింది. దీంతో రచ్చరచ్చయ్యింది. కొద్దిరోజుల తర్వాత సద్దుమణిగిందనుకున్న టైమ్‌లో ఇప్పుడిక చిరంజీవి రంగంలోకి దిగిపోయారు. ‘ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ప్రజలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధిపై దృష్టిపెట్టండి. ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలందిస్తే అంతా తలవంచి నమస్కరిస్తారు’ అని జగన్ సర్కార్‌పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలే చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చిరు కామెంట్స్‌పై పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. చిరు మాటలు విన్న జనాలు.. ఒకానొక సందర్భంలో జగన్ వద్ద చోతులు జోడించి కూర్చున్న ఆయనేనా ఇలా మాట్లాడిందనే సందేహాలు వెలిబుచ్చుతున్నారు.
ఇదేమైనా పద్ధతేనా..?
చిరు కామెంట్స్ (Chiru Comments On YSRCP) చూశారుగా.. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఇసుమంతైనా తప్పుందా..? రెమ్యునరేషన్ గురించి మీకెందుకు అన్నారు.. అవును నటీనటులు ఎంత తీసుకుంటారనే విషయం రాజకీయ నాయకులకు ఎందుకు..?.. వాళ్లు (లీడర్లు) చేయాల్సిన పనులేంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదా.! ఇండస్ట్రీ నుంచి వెళ్లాల్సిన అన్నిరకాల ట్యాక్స్‌లు గట్రా వెళ్తున్నాయ్ కదా ఇంతకుమించి ఇంకేం కావాలి..? ఎలాగో టాలీవుడ్-ప్రభుత్వానికి మంచి సఖ్యతే ఉంది.. దాన్ని అలాగే కంటిన్యూ చేయొచ్చు కదా..? అది చేయకపోగా మీడియా గొట్టాల ముందుకొచ్చి ఇష్టానుసారం నోరు పారేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా..? అనేది వైసీపీ నేతలకే తెలియాలి మరి. ఇక ప్రజలకు సంక్షేమ పథకాలు, రోడ్ల గురించి చూడండి అని చిరు సూచించారు సరే.. ప్రభుత్వం నుంచి చేస్తున్నాం.. చేయాల్సింది ఉందనో లేకుంటో ఇంకో విధంగానే సమాధానం ఇవ్వొచ్చు కానీ.. కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌లు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం ఎంతవరకు సబబు..? ఇవన్నీ కాదు.. అసలు చిరు ఏం మాట్లాడరనే విషయాలు విన్న తర్వాతే ఇలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారా..? లేకుంటే ప్రభుత్వం గురించి మాట్లారనేసరికి మీడియా ముందుకొచ్చేస్తున్నారో తెలియని పరిస్థితి. పోనీ పవన్ రెమ్యునరేషన్ ఎంతో చెబుతారనుకోండి.. తెలుసుకుని చేసేదేమైనా ఉందా..?. పోనీ ఇవన్నీ కాదు.. ప్రభుత్వంలో ఉన్నవారికి ఏం చేయాలో.. ఏం చేయకూడదో తెలుసు.. మీరు (చిరు) చెబితేనే మేం చేస్తామా..? మీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదని ఒక్కమాటతో వైసీపీ నేతలు ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టేయొచ్చు కానీ.. గిల్లితే గిల్లించుకోవాలి..? పిచ్చుక అని మీరు ఒప్పుకుంటున్నారా..? ఒక్కొక్కరు ఒక్కోలా ఇష్టారీతిన మాట్లాడటం అధికార పార్టీకే చెల్లుతుందేమో!. ఇక వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు అయితే.. సోషల్ మీడియా వేదికగా చిరును బూతులు తిట్టేస్తున్నారు. పవన్ రాజకీయాల్లో ఉన్నారు.. ఆయన్ను విమర్శించొచ్చు.. కౌంటర్లు ఇవ్వొచ్చు కానీ.. చిరు మాట్లాడిన మాటల్లో వైసీపీకి ఏం తప్పు కనిపించిందో వారికే తెలియాలి మరి.
గుర్తుందా జగనన్నా..?
సీఎం అయ్యాక జగన్‌ను అభినందించడానికి చిరు తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లినప్పుడు కారు దగ్గరికొచ్చి అన్నా.. అన్నా.. అని ఆప్యాయంగా పలకరించడం, మళ్లీ కారు దాకా వచ్చి సాగనంపడం ఇవన్నీ బహుశా వైసీపీ మరిచిపోయిందేమో. అప్పుడు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ (వైసీపీ సానుభూతిపరులు కాకుండా) పట్టించుకోకపోతే చిరు ముందుకొచ్చి ఇండస్ట్రీ తరఫున వచ్చి అభినందించిన రోజులు మరిచిపోతే ఎలా..? ఆ తర్వాత కూడా తనతో నిర్మాతలు, డైరెక్టర్లు, తోటి నటులను తీసుకొచ్చి మాట్లాడించిన రోజులను జగన్ మరిచిపోయారా..? అంటే అప్పుడు అన్నా.. అన్నా అని.. ఇప్పుడు అదే అన్నను.. వైసీపీ నేతలు ఈ రేంజ్‌లో విమర్శిస్తుంటే జగన్ చూస్తూ ఎందుకు ఉండిపోయారో.. ఆయన మనస్సాక్షికే తెలియాలి మరి. అయితే కొందరు వైసీపీలోని నేతలు, పార్టీలోని చిరుకు అభిమానులుగా ఉన్న కార్యకర్తలు జగన్‌ను.. చిరును టార్గెట్ చేసి మాట్లాడిన నేతలపై గుర్రుగా ఉన్నారట.
రేపొద్దున ఇదే జరిగితే..!
అయినా ఎన్నికల ముందు ఇంత రచ్చ చేసుకోవడం వైసీపీకి స్వయంకృపరాధమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే.. రీల్ ‘బ్రో’ వ్యవహారం ముగియక మునుపే పవన్ ‘రియల్ బ్రో’ చిరు వచ్చేశారు. రేపొద్దున ఈ కౌంటర్లను, జగన్ స్పందించకపోవడాన్ని చిరు సీరియస్‌గా తీసుకొని జనసేనకు సపోర్టుగా ఎన్నికల ప్రచారం చేస్తే పరిస్థితేంటో ఒక్కసారి ఊహించుకుంటే మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఎన్నికల ముందే ఇదంతా జరుగుతోందంటే.. అసలు సిసలైన ఎలక్షన్ సీజన్ వస్తే చిరు ఇలా చెలరేగిపోతారనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలే కనిపిస్తున్నాయే తప్ప.. ఫుల్‌స్టాప్ పడే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఏదేమైనా ఇదంతా వైసీపీ చేజేతులారా చేసుకున్న పనేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. మున్ముందు ఇంకా ఏం జరుగుతుందో చూడాలి మరి.