TSRTC : ‘బండి’ మళ్లీ మొదలెట్టారు.. ఆర్టీసీ విలీనంపై సంజయ్ హాట్ కామెంట్స్!
ABN , First Publish Date - 2023-08-05T15:47:57+05:30 IST
తెలంగాణ ప్రభుత్వంలో (TS Govt) ఆర్టీసీ విలీనంపై (TSRTC Merger) పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఆర్టీసీ విలీనానికి కేసీఆర్ క్యాబినెట్ ఆమోదం తెలపడం, గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం బిల్లు పంపడం.. రాజ్‌భవన్ నుంచి రిప్లయ్ రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కడం, విలీనం విషయంలో విధివిధానాలపై ప్రభుత్వానికి 5 ప్రశ్నలు సంధించడం, ప్రభుత్వం నుంచి రిప్లయ్ రావడం.. ఈ మధ్యలో ఆర్టీసీ సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో తమిళిసై మాట్లాడటం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి...
తెలంగాణ ప్రభుత్వంలో (TS Govt) ఆర్టీసీ విలీనంపై (TSRTC Merger) పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఆర్టీసీ విలీనానికి కేసీఆర్ క్యాబినెట్ ఆమోదం తెలపడం, గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం బిల్లు పంపడం.. రాజ్‌భవన్ నుంచి రిప్లయ్ రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కడం, విలీనం విషయంలో విధివిధానాలపై ప్రభుత్వానికి 5 ప్రశ్నలు సంధించడం, ప్రభుత్వం నుంచి రిప్లయ్ రావడం.. ఈ మధ్యలో ఆర్టీసీ సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో తమిళిసై మాట్లాడటం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. మరోవైపు.. ప్రభుత్వం తీరును బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. సడన్‌గా సంజయ్ ఇలా కామెంట్స్ చేయడంతో ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు.
రెండ్రోజులకే ఎలా..?
‘గవర్నర్ కార్మికులకు న్యాయం చేయాలని చూస్తున్నారు. గవర్నర్ అంటే రబ్బర్ స్టాంప్ కాదు. ఆర్టీసీ నష్టాలకు కేసీఆరే బాధ్యుడు. రేపో మాపో ఆర్టీసీ ఆస్తులు.. లీజుకో లేక అమ్మడమో చేస్తారు. గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి కేసీఆర్ కాల్చుతున్నారు. అంత పెద్ద బిల్లుపై రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుంటారా..?. తప్పు జరిగితే గవర్నర్ మీదకు తోయాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తోంది. గవర్నర్ పేరు చెప్పి కేసీఆరే విలీనం అడ్డుకుంటున్నారు. కేసీఆర్‌కు నిజంగా ఆర్టీసీని విలీనం చేసే ఉద్దేశం ఉందా..? లేదా..? తెలుసుకోవడానికే బిల్లును గవర్నర్ ఆపారు. ఆర్టీసీ విలీనంపై నెలలు, సంవత్సరాలు సమయం తీసుకున్న ప్రభుత్వం.. బిల్లు ఆమోదించడానికి గవర్నర్‌కు రెండ్రోజులు సమయం ఇవ్వడం ఏంటి..?. రెండ్రోజులకే గవర్నర్ ఎలా స్పందిస్తారు.. సమయం ఎలా సరిపోతుంది..?’ అని ప్రభుత్వంపై బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు.. ఆర్టీసీ విలీనం బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) కూడా స్పందించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి బీజేపీ (BJP) వ్యతిరేకం కాదన్నారు. ప్రభుత్వ ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. గవర్నర్ (Telangana Governor) లేని సమయంలో బిల్లు పంపి ఆమోదించడం లేదని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. బట్ట కాల్చి మీద వేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు ఇవ్వలేదని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు గుండెల్లో బాధను మర్చిపోలేదన్నారు.
మొత్తానికి చూస్తే.. అధ్యక్ష పదవి పోయిన తర్వాత కాస్త అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మోదీ వరంగల్ పర్యటనలో మునుపటిలా బండి సంజయ్ ప్రసంగం లేదు. ఆ తర్వాత కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో సంజయ్ మాట్లాడినప్పటికీ ఆ కామెంట్స్ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో ఇక మీడియా ముందుకు ఇప్పట్లో రారని.. మునుపటిలో కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధించరని కార్యకర్తలు, అభిమానులు అనుకున్నారు. ఇటీవలే కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని బండి కలిశారు. ఆ తర్వాతే సంజయ్‌లో ఎనలేని జోష్ వచ్చినట్లు అయ్యింది. ఇవాళ మీడియాతో మాట్లాడిన తీరును చూస్తే బండి ‘మళ్లీ మొదలైంది’ అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. సో.. మునుపటి బండి సంజయ్‌ను ఇక కార్యకర్తలు, అభిమానులు చూడనున్నారన్న మాట.