BRS : బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న విషాదాలు.. సాయన్న మరణవార్త మరువకముందే మరో సీనియర్ నేత కన్నుమూత..

ABN , First Publish Date - 2023-02-19T20:13:26+05:30 IST

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న(MLA Sayanna) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు కన్నుమూశారు...

BRS : బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న విషాదాలు.. సాయన్న మరణవార్త మరువకముందే మరో సీనియర్ నేత కన్నుమూత..

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న(MLA Sayanna) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు కన్నుమూశారు. ఎమ్మెల్యే మరణంతో బీఆర్ఎస్ (BRS) శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఆయన మరణవార్త మరవక ముందే బీఆర్ఎస్ పార్టీలో మరో విషాదం నెలకొంది. ఒకే రోజు ఒక ఎమ్మెల్యే, మరో సీనియర్ నేత మరణంతో బీఆర్ఎస్‌ను ఎందుకిలా వరుస విషాదాలు వెంటాడుతున్నాయని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

Sirajuddin.jpg

ఎవరా సీనియర్ నేత..?

సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత సయ్యద్ సిరాజుద్దిన్ (Syed Sirajuddin) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సిరాజ్ ఇకలేరని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ మరణవార్త తెలుసుకున్న అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. తాము ఎంతో అభిమానించే నేత ఇకలేరని అభిమానులు కంటతడిపెడుతున్నారు. మరికాసేపట్లో ఆస్పత్రి నుంచి సనత్‌నగర్‌లోని నివాసానికి సిరాజుద్దిన్ భౌతిక కాయాన్ని తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. ఆయన్ను కడసారి చూసేందుకు బీఆర్ఎస్ మంత్రులు, ముఖ్యనేతలు, హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఆస్పత్రికి వెళ్లి సంతాపం తెలిపి.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సిరాజుద్దిన్ కుటుంబాన్ని అన్ని విధాలా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుందని భరోసా నిచ్చారు నేతలు.

Sirajuddin-1.jpg

ప్రత్యేక గుర్తింపు ఇలా..!

కాగా.. సిరాజుద్దీన్ సనత్‌నగర్ జామా మసీదు జాఫ్రీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. కేసీఆర్ (KCR) పోరాట పఠిమ నచ్చిన సిరాజుద్దీన్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నాటి నుంచి నియోజకవర్గంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సనత్‌నగర్ (SanathNagar) నుంచి ఎవరు పోటీచేసినా వారిని గెలిపించడానికి శాయశక్తులా సిరాజుద్దీన్ పనిచేసేవారు. ముఖ్యంగా ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు (Talasani Sreenivas Yadav) అత్యంత సన్నిహితుడిగా ఉండేవారని సిరాజుద్దిన్ అభిమానులు చెప్పుకుంటున్నారు. తలసాని బీఆర్ఎస్‌ తరఫున పోటీచేసి గెలవడంలో సిరాజుద్దీన్ ముఖ్యపాత్ర పోషించారని తెలుస్తోంది. కాసేపట్లో సిరాజుద్దిన్ నివాసానికి ఆయన పార్థివదేహానికి తలసాని నివాళులు అర్పించనున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని ధైర్యం, భరోసా ఇవ్వనున్నారు.

Sayanna.jpg


**********************************

ఇవి కూడా చదవండి..

MLA Sayanna: గుండెపోటుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి


**********************************

#RIPTarakaRatna : రాజకీయాలను పక్కనపెట్టి నందమూరి తారకరత్న ఇంటికి వైఎస్ షర్మిల..

**********************************

TarakaRatna : తారకరత్నను ఐసీయూలో పరామర్శించిన మాజీ మంత్రి.. బయటికొచ్చాక...!


**********************************

Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!


**********************************

TarakaRatna : ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్న తారకరత్న... చంద్రబాబు, లోకేష్‌తో కూడా చర్చ.. అయ్యో పాపం చివరికోరిక తీరకుండానే..!

Updated Date - 2023-02-19T20:42:41+05:30 IST