YSRCP : ఏపీ కేబినెట్‌ నుంచి ముగ్గురు ఔట్ కానున్నారా.. జగన్ ప్రకటనతో మంత్రుల్లో పెరిగిపోయిన టెన్షన్.. ఇంతకీ వారెవరు..!?

ABN , First Publish Date - 2023-03-14T17:32:51+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ మంత్రులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) క్లాస్ తీసుకున్నారు. మంగళవారం నాడు సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది..

YSRCP : ఏపీ కేబినెట్‌ నుంచి ముగ్గురు ఔట్ కానున్నారా.. జగన్ ప్రకటనతో మంత్రుల్లో పెరిగిపోయిన టెన్షన్.. ఇంతకీ వారెవరు..!?

ఏపీ అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ మంత్రులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) క్లాస్ తీసుకున్నారు. మంగళవారం నాడు సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA Kota MLC Elections) కచ్చితంగా గెలవాలని మంత్రులను ఒకింత హెచ్చరించారు. మంత్రులు ఎవరేం చేస్తున్నారో.. అందరి పనితీరు గమనిస్తున్నానన్నారు. తేడాలొస్తే మంత్రులను మార్చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యతలను మంత్రులకు సీఎం కట్టబెట్టారు. ఒక్కో మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేల బాధ్యతలను ఆయన అప్పగించారు. ఇచ్చిన బాధ్యతలు సరిగ్గా నిర్వహించకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు.

YS-Jagan-Serious.jpg

ముగ్గుర్ని పక్కనెడతారా..!?

మంత్రుల తీరు బాగాలేకపోతే ఇద్దరు ముగ్గుర్ని పదవుల నుంచి తప్పించడానికి కూడా ఏ మాత్రం వెనకాడనని సీఎం తేల్చిచెప్పేశారట. స్వయంగా సీఎం జగనే ఈ కామెంట్స్ చేయడంతో మంత్రుల్లో టెన్షన్ మొదలైందట. దీంతో కేబినెట్ నుంచి ఎవర్ని తొలగిస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొందట. అంతేకాదు.. శాఖాపరంగా, పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు కూడా ఉంటాయని ఇంకొందరు మంత్రులను జగన్ పరోక్షంగా హెచ్చరించారట. అయితే జగన్ ఎవరెవర్ని మంత్రి పదవుల్లో నుంచి తొలగిస్తారు..? ఎవరెవరి శాఖలు మారుస్తారనే దానిపై వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. ఆ ముగ్గురిలో ఇద్దరు కోస్తా జిల్లాకు చెందిన వారుకాగా.. మరొకరు రాయలసీమకు చెందినవారని తెలుస్తోంది. ఆ ముగ్గురు మంత్రుల స్థానంలో ముగ్గుర్ని ఎమ్మెల్సీలను (Three MLC) కేబినెట్‌లోకి తీసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Jagan-Cabinet.jpg

కీలక సూచనలు..!

అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. గత నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశామో.. అసెంబ్లీ వేదికగా అంశాలవారీగా అందరూ మాట్లాడాల్సిందేనని మంత్రులకు జగన్ తెలిపారు. మరోవైపు.. జులైలో విశాఖ వెళ్తున్నామని మరోసారి మంత్రివర్గ సమావేశంలో జగన్ ప్రకటించారు. కాగా.. గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో కోస్తాకు చెందిన ఒక మంత్రికి.. రాయలసీమకు చెందిన మరో మంత్రికి జగన్ క్లాస్ తీసుకున్నారు. ఒకరేమో అనవసరంగా వేరే నియోజకవర్గాల్లో తలదూర్చడం.. ఇంకో మంత్రిపై భూ తగాదాల ఆరోపణలు రావడంతో ఇద్దరినీ ప్రత్యేకంగా తన కేబిన్‌కు పిలిచి ఇద్దర్నీ హెచ్చరించారు. అయితే తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ ఇద్దరి ప్రస్తావన మరోసారి వచ్చినట్లు తెలియవచ్చింది. ఆ విషయాలన్నీ మాట్లాడిన తర్వాతే ముగ్గుర్ని కేబినెట్‌ ఔట్ కాబోతున్నారని స్వయంగా జగనే చెప్పేశారట.

Cabinet-1.jpg

మొత్తానికి చూస్తే.. ఏపీ కేబినెట్ నుంచి కొందరు మంత్రులు ఔట్ కాబోతున్నారని రూమర్స్ రాగా.. ఇప్పుడు అవన్నీ తాజా పరిణామాలతో అక్షరాలా నిజమయ్యాయి అన్న మాట. ఫైనల్‌గా కేబినెట్ నుంచి ఔటయ్యే ఆ ముగ్గురు మంత్రులెవరో.. ఆ పదవులు ఎవరికి దక్కుతాయో.. అసలు ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

*************************

ఇది కూడా చదవండి..

*************************

YS Jagan : ఇద్దరు మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం జగన్.. మారకపోతే బాగోదని సీరియస్ వార్నింగ్.. మౌనంగా వెళ్లిపోయిన మహిళా మినిస్టర్..!


*************************

Kiran Reddy : ఏపీలో బీజేపీకి ఆశా ‘కిరణ్’మా.. ఈయన్ను పార్టీ ఎలా వాడుకోబోతోంది.. అధిష్ఠానం ప్లానేంటి..!?


******************************

TS BJP : అరెరే.. అమిత్ షా సాక్షిగా బండి, కిషన్ రెడ్డి ఇలా చేశారేంటబ్బా.. ఇదేందయ్యా ఇది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోలు..!


******************************

Oscar to RRR : ఆహా.. బండి సంజయ్‌లో ఇంత మార్పా.. నాడు తిట్లు.. నేడు ప్రశంసలు.. అప్పుడు భయపడి ఉంటే..!


******************************

TS BJP : తెలంగాణ బీజేపీలో లుకలుకలు.. కాంగ్రెస్ పరిస్థితులు రిపీట్ అవుతున్నాయా.. బాబోయ్ ఈ రేంజ్‌లోనా..!


******************************

Pawan Kalyan : వైసీపీకి ఊహించని షాక్.. జనసేనలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు.. ఇలా జరిగిందేంటి..!?


******************************

Delhi Liquor Scam Case : ఇంకా అయిపోలేదు.. మళ్లీ రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు..!


*****************************

Updated Date - 2023-03-14T17:45:03+05:30 IST