Avinash Reddy Arrest: వైఎస్ వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. అవినాశ్‌ను అరెస్ట్ చేసిన విషయాన్ని దాచిన సీబీఐ..!

ABN , First Publish Date - 2023-06-08T19:34:24+05:30 IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గోప్యంగా కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలిసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని గత శనివారం (జూన్ 3, 2023) (అవినాశ్‌కు ముందస్తు బెయిల్ వచ్చిన రోజు) అరెస్ట్ చేసి, ఆ వెంటనే విడుదల చేసినట్లు సమాచారం.

Avinash Reddy Arrest: వైఎస్ వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. అవినాశ్‌ను అరెస్ట్ చేసిన విషయాన్ని దాచిన సీబీఐ..!

హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గోప్యంగా కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలిసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని గత శనివారం (జూన్ 3, 2023) అరెస్ట్ చేసి, ఆ వెంటనే విడుదల చేసినట్లు సమాచారం. మే 31న హైకోర్టు ముంద‌స్తు బెయిల్ ఆదేశాల మేర‌కు రూ.5 లక్షల పూచీక‌త్తుపై అవినాశ్ రెడ్డిని విడుద‌ల చేసిన‌ట్లు తెలిసింది. అనంతరం అవినాశ్రెడ్డిని ఏ8గా సీబీఐ చేర్చడం గమనార్హం. అవినాశ్రెడ్డి అరెస్ట్ను సీబీఐ గోప్యంగా ఉంచడం ఈ మొత్తం ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్. భాస్కర్‌రెడ్డి బెయిల్పై దాఖ‌లు చేసిన కౌంట‌ర్లో అవినాశ్ని ఏ8గా సీబీఐ పేర్కొనడం గమనార్హం. అంతేకాదు, భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. అవేంటంటే..

భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కౌంటరులో పలు అంశాలు:

* అవినాశ్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడు(A8)గా పేర్కొన్న సీబీఐ

* కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాశ్‌, భాస్కర్‌రెడ్డి ప్రమేయం: సీబీఐ

* తండ్రీకుమారులు కేసులో దర్యాప్తును పక్కదారి పట్టించారు: సీబీఐ

* వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేత వెనుక కుట్రపై దర్యాప్తు కొనసాగుతోంది

* శివశంకర్రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాశ్‌ హత్యాస్థలికి చేరారు

* ఉ.5:20 గం.లకు ముందే అవినాశ్‌, శివశంకర్‌రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు: సీబీఐ

* కేసు పెట్టొద్దు, పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాశ్‌, శివశంకర్‌ చెప్పారు

* సీబీఐకి, కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని ప్రలోభపెట్టారు: సీబీఐ

* దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు అవినాశ్‌, భాస్కర్రెడ్డి, శివశంకర్‌ ప్రయత్నించారు

* భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తును, కీలక సాక్షులను ప్రభావితం చేస్తారు

* కడప, పులివెందులలోభాస్కర్‌రెడ్డి చాలా ప్రభావితం చేయగల వ్యక్తి: సీబీఐ

* అరెస్ట్‌ చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనలే నిదర్శనం: సీబీఐ

* భాస్కర్‌రెడ్డి బయట ఉంటే.. పులివెందుల సాక్షులు ప్రభావితమైనట్లే: సీబీఐ

* భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమే: సీబీఐ

*సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తే కేసుకు పూడ్చలేని నష్టం: సీబీఐ

* దర్యాప్తునకు సహకరించానని భాస్కర్‌రెడ్డి చెప్పడం అబద్ధం: సీబీఐ

వైఎస్‌ భాస్కర్‌రెడ్డిపై గతంలోనే 3 కేసులు:

* వైఎస్‌ భాస్కర్‌రెడ్డిపై గతంలో 3 కేసులున్నాయి: సీబీఐ

* పేలుడు పదార్థాల చట్టం సహా 3 కేసులు ఉన్నాయి: సీబీఐ

* 2 కేసులు వీగిపోగా.. మరొకటి తప్పుడు కేసుగా తేలింది: సీబీఐ

* కేసుల ప్రకారం భాస్కర్‌రెడ్డి నేపథ్యం ప్రశ్నార్థకంగా ఉంది: సీబీఐ

* వివేకా హత్యలోనూ భాస్కర్‌రెడ్డి నేపథ్యం ప్రశ్నార్థకంగానే ఉంది: సీబీఐ

* ఏప్రిల్ 16 నుంచి జైలులో ఉన్నంత మాత్రాన బెయిల్‌ ఇవ్వాలని లేదు

* వివేకా హత్య విషయం జగన్‌కు ఉ.6.15 గం.లకు ముందే తెలుసు: సీబీఐ

* వివేకా పీఏ చెప్పకముందే జగన్‌కు తెలుసని దర్యాప్తులో గుర్తించాం: సీబీఐ

Updated Date - 2023-06-08T21:04:44+05:30 IST