Home » Patnam Narender Reddy
లగచర్ల దాడి కేసులో నిందితుడైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును కోరతామని మల్టీ జోన్ ఐజీ వీ సత్యనారాయణ తెలిపారు.
లగచర్ల ఘటనలో తనతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా ఇరికించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు.
వికారాబాద్(Vikarabad) జిల్లా కొడంగల్(Kodangal) మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)కి హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. బోంరాస్‌పేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
లగచర్ల ఘటన నిందితుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి గురువారం సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు బుధవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కస్టడీ ముగియడంతో లగచర్ల ఘటనలో ఏ-1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని సోమవారం పోలీసులు తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు.
లగచర్ల దాడి ఘటన కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని శనివారం పోలీసులు విచారించారు.
లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ మున్సిఫ్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. లగచర్ల దాడి ఘటనలో తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును పట్నం నరేందర్ రెడ్డి ఆశ్రయించారు.
లగచర్లలో భూసేకరణకు సంబంధించిన విచారణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో ఏ-1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కీలక కుట్రదారుడని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు చెప్పారు. ఏ-2గా ఉన్న సురేశ్, ఇతర నిందితులకు ఆర్థికంగా, నైతికంగా సహకరించారని తెలిపారు.
భూములు ఇవ్వకపోతే అర్ధరాత్రి ఇళ్లల్లో చొరబడి ఆడవాళ్లు , చిన్నపిల్లలు అని తేడా లేకుండా రేవంత్ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధ్వజమెత్తారు. పేదవారి భూములను లాక్కుంటే ఊరుకోము వారికి తాము అండగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు.