NCBN : జైలు నుంచి బయటికొచ్చాక చంద్రబాబు తొలి ప్రసంగం.. ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-10-31T17:24:00+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి వచ్చారు. ఇవాళ ఉదయం స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు కొన్ని షరతులతో మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి వచ్చారు. ఇవాళ ఉదయం స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు కొన్ని షరతులతో మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో సరిగ్గా 4:16 గంటలకు చంద్రబాబు జైలు నుంచి ఈ సందర్భంగా జైలు నుంచి బయటి వరకూ నడుచుకుంటూనే బయటికి వచ్చారు. బాబు బయటికి రావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆనందంలో మునిగి తేలుతూ.. సంబరాలు చేసుకున్నారు. భారీగా జైలు వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు, టీడీపీ నేతల తాకిడితో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. బయటికి వచ్చాక చంద్రబాబు తొలి ప్రసంగం చాలా ఆసక్తికరంగా సాగింది. చంద్రబాబు బయటికి రాగానే ప్రసంగించిన తీరును చూసిన టీడీపీ శ్రేణులు ‘జై బాబు.. జై జై బాబు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు ప్రసంగాన్ని కాస్త నిశితంగా పరిశీలిస్తే.. మునుపటికీ ఇప్పటికీ ఏ మాత్రం మార్పు లేదు.
బాబు ఏం మాట్లాడారు..?
తెలుగు ప్రజలకు అభినందనలు
నాకు సంఘీభావం తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు
నాపై మీరు చూపిన అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను
కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ మద్దతుగా నిలిచారు
రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారు.. పూజలు చేశారు
45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదు
నేను ఏనాడు తప్పు చేయలేదు.. ఎవరినీ తప్పు చేయనివ్వను
మాకు మద్దతుగా అన్ని పార్టీలకు అభినందనలు
జనసేనకు.. పవన్‌కల్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ, విదేశాల్లోనూ సంఘీబావం ప్రకటించారు
నేను చేపట్టిన విధానాల వల్ల లబ్ధి పొందిన వారంతా మద్దతిచ్చారు
నాకు మద్దతుగా నిలిచిన అందరికా పేరుపేరునా ధన్యవాదాలు
అండగా నిలిచిన వివిధ పార్టీల నేతలకు ధన్యవాదాలు
సంఘీభావం తెలిపిన జనసేనకు.. పవన్‌కల్యాణ్ మనస్ఫూర్తిగా అభినందనలు