Share News

BRS : ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి.. బీఫామ్ ఇవ్వని కేసీఆర్..!

ABN , First Publish Date - 2023-10-15T22:22:21+05:30 IST

అవును.. బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లే ఫైనల్ కాదు.. బీఫామ్‌లు ఇచ్చేలోపు మార్పులు, చేర్పులు కచ్చితంగా ఉంటాయ్.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు..! ఇవీ అభ్యర్థులు ప్రకటించినప్పుడు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు. ఆయన అన్నట్లుగానే పరిస్థితి ఉంది..

BRS : ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి.. బీఫామ్ ఇవ్వని కేసీఆర్..!

అవును.. బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లే ఫైనల్ కాదు.. బీఫామ్‌లు ఇచ్చేలోపు మార్పులు, చేర్పులు కచ్చితంగా ఉంటాయ్.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు..! ఇవీ అభ్యర్థులు ప్రకటించినప్పుడు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు. ఆయన అన్నట్లుగానే పరిస్థితి ఉంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాక ఎన్నెన్ని రాద్ధాంతాలు జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సరిగ్గా ఈ టైమ్‌లోని అక్టోబర్-15న 51 మంది అభ్యర్థులకు కేసీఆర్.. బీ ఫామ్‌లు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, నిజమాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మంకు చెందిన 43మంది అభ్యర్థులకు బీ- ఫామ్‌ను కేసీఆర్ అందజేశారు. వీరితో పాటు.. కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, హరీష్ రావు, నోముల భగత్, క్రాంతి కిరణ్, గూడెం మహిపాల్ రెడ్డి, చల్మడ లక్ష్మి నరసింహరావు, పైళ్ళ శేఖర్ రెడ్డికి బాస్.. బీ-ఫామ్ అందజేశారు. బీఫామ్‌లతో పాటు ఒక్కొక్కరికీ రూ.40 లక్షల చెక్కును కేసీఆర్ అందజేశారు. అయితే ఆయా జిల్లాల్లో పేర్లు రాని.. తెలంగాణ భవన్‌కు పిలుపురాని అభ్యర్థుల పరిస్థితి మాటల్లో చెప్పలేనిది..! కొందరు సోమవారం అయినా పిలుపు వస్తుందని అనుకుంటున్నప్పటికీ.. మరికొందరేమో ఇక అంతా అయిపోయినట్టేలే అని ఆశలు వదిలేసుకుంటున్నారు.


KCR-And-Abraham.jpg

ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటో..?

తెలంగాణ భవన్‌లో అలా బీఫామ్‌లు ఇచ్చి.. హుస్నాబాద్ సభ ముగించుకుని కేసీఆర్ ఇంటికొచ్చారో లేదో ఇంతలోనే షాకింగ్ వార్త బయటికొచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వంపై గులాబీ బాస్ నిర్ణయం మార్చుకున్నారు. అందుకే.. అభ్యర్థిగా అబ్రహం పేరు ప్రకటించినప్పటికీ ఆదివారం నాడు బీఫామ్ ఇవ్వలేదు. అలంపూర్ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దింపే యోచనలో అధిష్టానం ఉంది. ఆ స్థానానికి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నిశితంగా పరిశీలన చేసి మరో నేతను బరిలోకి దింపాలని రిపోర్టు ఇచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు స్థానిక నేత విజయుడి పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా స్వయంగా కేసీఆరే ప్రకటించబోతున్నారని తెలిసింది. దీంతో బీఫామ్‌లు దక్కని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. బీఫామ్‌ చేతికొచ్చేవరకూ తాను అభ్యర్థిని, పోటీచేస్తున్నాననే విషయం మరిచిపోవాలని తమ అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో నేతలు చెబుతున్న పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో నెలకొంది.

Abraham.jpg

ఎందుకీ మార్పు..!

వాస్తవానికి.. అబ్రహంను అభ్యర్థిగా ప్రకటించడంపై నియోజకవర్గంలో మొదట్నుంచీ వ్యతిరేకత వస్తోంది. ఈ అసమ్మతి తీవ్రస్థాయికి చేరుకోవడంతో అసలేం జరుగుతోందని అధిష్టానం ఆరాతీసింది. అబ్రహంను కొందరు నేతలు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని.. అభ్యర్థిని మార్చాలంటూ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందనే విషయాన్ని అధిష్టానం గమనించింది. అయితే.. అబ్రహం కాకుండా ఎవరిని అభర్థిగా ప్రకటించినా మద్దతు ఇస్తామని అసమ్మతి వర్గం తేల్చిచెప్పడంతో.. చేజేతులారా సీటు పోగొట్టుకోవడం కంటే అభ్యర్థిని మారిస్తే సరిపోతుందని స్థానిక నేత ‘విజేయుడు’ని హైకమాండ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్పు అనేది అలంపూర్‌తోనే ముగుస్తుందా లేకుంటే.. మరికొన్ని నియోజకవర్గాలకు పాకుతుందో చూడాలి మరి.

KCR-Sabha-2.jpg


ఇవి కూడా చదవండి


KCR Speech : కేసీఆర్ తొలి ప్రసంగంలోనే పస లేదేం.. సార్‌కు ఏమైందబ్బా..!?


TS Polls : కీలక పరిణామం.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు బిగ్ షాట్‌లు.. పార్టీలో చేరకముందే టికెట్ ఫిక్స్..!


BRS Manifesto : బీఆర్ఎస్ పూర్తి మేనిఫెస్టో ఇదే.. హ్యాట్రిక్ కొట్టేందుకు కేసీఆర్ ప్లాన్ గమనించారా..?


BRS B-Forms : 119 మంది నియోజకవర్గాలు ఉంటే.. 51 మంది అభ్యర్థులకే కేసీఆర్ ఎందుకు బీ-ఫామ్‌లు ఇచ్చారు..?


TS Assembly Polls : చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రసంగం.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి..


KCR Sabha : ప్రజలారా ఆగం కావొద్దు.. ఆలోచించి ఓట్లేయాలి!



Updated Date - 2023-10-15T22:25:50+05:30 IST