Viveka Murder Case : సీబీఐ విచారణ జరుగుతుండగానే మరో బాంబ్ పేల్చిన దస్తగిరి.. అసలు విషయం చెప్పేసిన డ్రైవర్..

ABN , First Publish Date - 2023-04-17T18:08:19+05:30 IST

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) సీబీఐ (CBI) దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని..

Viveka Murder Case : సీబీఐ విచారణ జరుగుతుండగానే మరో బాంబ్ పేల్చిన దస్తగిరి.. అసలు విషయం చెప్పేసిన డ్రైవర్..

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) సీబీఐ (CBI) దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని (YS Bhaskar Reddy) సీబీఐ అరెస్ట్ చేయగా.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి (MP Avinash Reddy) కూడా నోటీసులు జారీ చేసింది. అప్పటికే ముందస్తు బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టులో (TS High Court) అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అటు అవినాష్ తరఫు న్యాయవాది.. ఇటు సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు రేపు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు విచారించాలని ఆదేశించింది. అంతేకాదు.. బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా రేపటికే వాయిదా వేసింది హైకోర్టు. సరిగ్గా ఇలా హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి (Driver Dastagiri) మీడియా ముందుకొచ్చారు. కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంచలన ఆరోపణలు చేయడంతో పాటు.. తనకు ప్రాణహాని ఉందని కూడా చెప్పారు.

MP-Avinash-Reddy-Media.jpg

అవును నిజమే చెబుతున్నా..!

సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy), ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి నాకు ప్రమాదం పొంచి ఉంది. ఈ కేసులో నేను అప్రూవర్‌గా మారడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. నేను అప్రూవర్‌గా మారే సమయంలో అవినాష్ రెడ్డి లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదు..?. మీ వరకు రానంత వరకు దస్తగిరి మంచోడు.. ఇప్పుడు మాత్రం చెడ్డవారుగా మారాడా..?. సునీత నుంచి గానీ సీబీఐనుంచి గానీ నేను ఒక్క రూపాయి కూడా డబ్బు తీసుకోలేదు. డబ్బు తీసుకున్నట్లు నిరూపిస్తే జీవితాంతం జైల్లో ఉండేందుకు కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఎర్ర గంగిరెడ్డి చెబితేనే అప్పుడు డబ్బుకు ఆశపడి హత్య చేశాం. ఇప్పుడు నాకు ఆ అవసరం లేదు. అందుకే నేను సీబీఐకి నిజం చెప్పేశాను. పలుకుబడి ఉందని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌ను కూడా మార్చేశారు. రామసింగ్‌ను మార్చితే కొత్త సీబీఐ బృందం ఏమైనా కొత్త కోణంలో విచారిస్తుందా..?. వివేకా కేసులో మీ పాత్ర ఉందని తెలుసు కాబట్టే ఏ అధికారైనా ఆ విధంగానే దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు అధికారిగా ఎవరున్నా ఇలాగే చేస్తారుఅని దస్తగిరి మీడియాకు వెల్లడించారు.

YS-Sunitha-Reddy.jpg

నేనెక్కడికీ పారిపోలేదు..!

నేను తప్పు చేశాను. తప్పు చేశాను కాబట్టే ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు సిద్ధపడ్డాను. నేను పారిపోయినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. నేను ఎక్కడికీ పారిపోలేదు. పులివెందులలోని విజయమ్మ కాలనీలోనే నేను ఉన్నాను. మళ్లీ చెబుతున్నా నేను ఎక్కడికీ పారిపోను. దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. నేను తప్పు చేస్తే కచ్చితంగా జైలుకు వెళ్తాను. మీరు (అవినాష్ రెడ్డిని ఉద్దేశించి) తప్పు చేస్తే మీరు కూడా జైలుకు వెళ్తారు. మీరు తప్పు చేసినట్లు రుజువైతే రాజీనామా చేస్తారా?. అవినాష్ పాత్ర ఉంది కాబట్టే సీబీఐ నోటీసులు ఇచ్చిందిఅని అవినాష్‌‌కు దస్తగిరి ఛాలెంజ్ చేశారు.

Dastairi-Media.jpg

కాగా.. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందుకొచ్చిన దస్తగిరి వివేకా హత్యకేసులో మరికొన్ని రోజుల్లో నిజాలు తేలలనున్నాయని, నిజాలు బయటపడే రోజు దగ్గర పడిందని చెప్పుకొచ్చారు. ఇంతకాలం దస్తగిరి చెప్పినదంతా అబద్దమని అని కొందరు అన్నారని.. తాను చెప్పిన నిజాలు ఏమిటో ఇక తెలుస్తాయన్నారు. రాష్ట్రంలో విచారణకు సీఎం జగన్ (CM Jagan) సహకరించి ఉంటే పది రోజుల్లో కేసు పూర్తయ్యేదని దస్తగిరి చెప్పుకొచ్చారు. ఇలా చెప్పిన కొన్నిరోజులకే మరోసారి మీడియా ముందుకొచ్చి పై విషయాలన్నీ పూసగుచ్చినట్లుగా చెప్పారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Viveka Murder Case : ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. తగ్గేదేలే అని తేల్చి చెప్పేసిన సీబీఐ.. హైకోర్టు కీలక ఆదేశాలు

******************************
MP Avinash CBI Enquiry : ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణలో మరో ట్విస్ట్.. ఎవరూ క్లారిటీ ఇవ్వరేం..!?


******************************

Updated Date - 2023-04-17T18:17:06+05:30 IST